రేపోమాపో హౌస్‌ఫుల్‌ !


Wed,June 19, 2019 01:08 AM

- ఎన్‌బీటీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు
- వంద శాతం ఫలితాలతో ఆదరణ
బంజారాహిల్స్‌, (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 12లోని ఎన్‌బీటీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అడ్మిషన్లు జోరుగా కొనసాగుతున్నాయి. పదో తరగతి పరీక్షల్లో వందశాతం ఫలితాలు సాధించి బస్తీలోని అన్ని ప్రైవేటు స్కూళ్లను అదిగమించడంతో తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపిస్తున్నారు. గత ఏడాది 170 మంది విద్యార్థులు ఈ స్కూల్లో అడ్మిషన్లు తీసుకోగా ఈ యేడా ది ఇప్పటికే సుమారు 130 మంది విద్యార్థులు స్కూల్‌ లో చేరారు. కాగా 54 మంది పదోతరగతి విద్యార్థులు పాఠ శాలను వీడారు. ఇదే ప్రాంగణంలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు చెందిన మరో 100 మంది కూడా హైస్కూల్‌లో చేరాల్సి ఉంది. గత యేడాది ఎన్‌బీటీనగర్‌ హైస్కూల్‌లో మొత్తం 543 మంది విద్యార్థులు ఉండగా ఈ యేడాది ఆ సంఖ్య 600 దాటే అవకాశం ఉండడంతో కొత్తగా విద్యార్థులను తీసుకోవడం కష్టమే అని ఉపాధ్యాయులు అంటున్నారు.

మరో రెండురోజుల్లో స్కూల్‌ వద్ద హౌజ్‌పుల్‌ బోర్డు పెట్టాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా ఈ స్కూల్‌లోని విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తుండడంతో క్రమక్రమంగా విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. 2016లో 504 మంది ఉండగా ఈ యేడాది ఇప్పటికే 600 మంది విద్యార్థులు స్కూల్‌లో ఉన్నారంటే ఈ స్కూల్‌కు ఉన్న ఆదరణ ఏ విధంగా పెరుగుతుందో తెలుస్తుందని ఉపాధ్యయులు అంటున్నారు. బస్తీలోని పలు ప్రైవేటు పాఠశాలలనుంచి విద్యార్థులు తమ స్కూల్‌లో అడ్మిషన్‌ కోసం వస్తున్నారని, వారందరికీ సీటు ఇవ్వడం కష్టమే అని ఇన్‌చార్జి హెడ్‌మిసెస్‌ అనిత తెలిపారు. ప్రైవేటు స్కూళ్లనుంచి వచ్చే విద్యార్థులలో నైపుణ్యాన్ని పరిశీలించేందుకు అడ్మిషన్‌ టెస్ట్‌ నిర్వహించి ప్రవేశాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ స్కూల్‌లో ప్రసు ్తతం ఉన్న 14సెక్షన్లకు గాను 13 గదులే అందుబాటులో ఉన్నాయని, ప్రైమరీ స్కూల్‌కు చెందిన ఒక గదిని తీసుకుని తాము క్లాస్‌లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పక్కన నిర్మిస్తున్న అదనపు గదులు పూర్తయితే కొంత సౌకర్యంగా ఉంటుందని ఆమె వెల్లడించారు. మొత్తం మీద ప్రభుత్వ పాఠశాలలంటే ప్రజ ల్లో ఉన్న అపోహలు తొలగిపోవడంతో అడ్మిషన్ల కోసం విద్యార్థులు బారులు తీరుతుండడం శుభపరిణామని స్థానికులు అంటున్నారు.
గత నాలుగేళ్లలో విద్యార్థుల సంఖ్య
2016-17 -504
2017-18 -541
2018-19 -543
2019-20 -600

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...