చిరస్మరణీయుడు కేశవ్‌రావు జాదవ్‌


Tue,June 18, 2019 04:05 AM

రవీంద్రభారతి : తెలంగాణ కోసం, పౌరహక్కుల కోసం తుది వరకు నిస్వార్థపరుడిగా జీవించిన ప్రొఫెసర్‌ కేశవ్‌రావు జాదవ్‌ చిరస్మరణీయుడని పలువురు నివాళులు అర్పించారు. రవీంద్రభారతిలోని సమావేశ మం దిరంలో తెలంగాణ జనపరిషత్‌, జాదవ్‌ అభిమానులు, అనుచర బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన జాదవ్‌ వర్థంతి సభలో తొలుత ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించి ప్రసంగించారు. విద్యార్థి దశనుంచి సోష లిస్టు సిద్ధాంతాన్ని నమ్మిన జాదవ్‌ తను నమ్మిన సిద్థాంతం కోసం చివరి వరకు పోరాడిన నిఖార్స అయిన సోషలిస్టు అని గుర్తు చేశారు. తొలి దశ ఉద్యమంలో ఉద్యమకారులకు మార్గదర్శకుడిగా నిలిచాడని గుర్తు చేశారు. తెలంగాణ జనపరిషత్‌ కన్వీనర్‌ వలిగొండ విజయరాజు అధ్యక్షతన జరిగిన సభలో తెలంగాణ యునై టెడ్‌ ఫ్రంట్‌ చైర్‌పర్సన్‌ విమలక్క, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, లోహియా విచార్‌ మంచ్‌ నాయకులు ఎ. నారాయణ, దర్శక నిర్మాత సయ్యద్‌ రఫి,ఉద్యోగ సంఘ నాయకులు గోపాల్‌రెడ్డి, రిటైర్డ్‌ జడ్జి గోపాల్‌సింగ్‌, మాజీ శాసన సభ్యులు పి.జనార్థన్‌రెడ్డి, సోషలిస్టు నాయకులు బాబూరావు, ప్రొఫెసర్‌ ముత్యంరెడ్డి తదితరులు పాల్గొని జాదవ్‌ వ్యక్తిత్వాన్ని ఘనంగా ఆవిష్కరిస్తూ నివాళులు అర్పించారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...