అభివృద్ధి పనుల పరిశీలన..


Tue,June 18, 2019 04:04 AM

అమీర్‌పేట్‌, జూన్‌ 17 (నమస్తే తెలంగాణ) : సనత్‌నగర్‌ డివిజన్‌లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను మంత్రి తలసాని సోమవారం సాయంత్రం జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిశోర్‌తో కలిసి పర్యవేక్షించారు. ముందుగా బల్కంపేట శ్మశానవాటికలో చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అక్కడ నిర్మాణ పనులు చేపడుతున్న సంస్థతో పాటు ప్రాజెక్టు అధికారులు రాబోయే మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని హామీనిచ్చారు. మహాప్రస్థానం తరహాలో చేపడుతున్న ఈ శ్మశానవాటిక గ్రేటర్‌లోనే మోడల్‌గా తీర్చిదిద్దబడుతుందని, సనత్‌నగర్‌ నెహ్రూపార్కులో ప్రస్తుతం ఉన్న కమ్యూనిటీ హాలు మరింత విస్తరించే పనులను ముమ్మరం చేస్తామని మంత్రి తలసాని పేర్కొన్నారు. సనత్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో కమ్యూనిటీ హాలు కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాలు నిర్మాణం జరుగుతుందన్నారు. అనంతరం సనత్‌నగర్‌ పారిశ్రామికవాడ పార్కును సందర్శించారు. రూ. 4 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఇండోర్‌ స్టేడియం నిర్మా ణ పనులను పరిశీలించి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్పొరేటర్‌ కొలన్‌ లక్ష్మీరెడ్డి, సెంట్రల్‌ జోన్‌ కమిషనర్‌ ముషార్రఫ్‌ ఫరూఖీ, డిప్యూటీ కమిషనర్‌ గీతారాధిక, జలమండలి జీఎం ప్రభులతో పాటు టీఆర్‌ఎస్‌ నాయకులు కొలన్‌ బాల్‌రెడ్డి, సురేశ్‌గౌడ్‌, సంతోష్‌ సరఫ్‌, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...