త్వరలో ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ : దానకిశోర్‌


Tue,June 18, 2019 04:03 AM

మన్సూరాబాద్‌ / సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్‌లో జంతువుల సంరక్షణలో భాగంగా రూ. 7 కోట్లతో నాగోలు సమీపంలోని ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ను జూలై 10న ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ వెల్లడించారు. సోమవారం ఫతుల్లాగూడలో నూతనంగా నిర్మిస్తున్న ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులను జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న ఎనిమల్‌ వెల్ఫేర్‌ సెంటర్‌లో అసంపూర్తి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జూలై 10 లోపు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రూ. ఏడు కోట్లతో ఫతుల్లాగూడలో నిర్మిస్తున్న ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌లో 400 కుక్కలు, 200 కోతు లు, 50కి పైగా గేదెలకు షెల్టర్‌ ఇవ్వవచ్చునని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే అంబర్‌పేట్‌లో ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని.. దీనికి అధనంగా జీడిమెట్లలోనూ ఎనిమల్‌ వెల్ఫేర్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఫతుల్లాగూడ, జవహర్‌నగర్‌, గాజులరామారంలో ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానంతో ఎనిమల్‌ క్రిమిటోరియాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. వీటి ఏర్పాటుకు టెండర్లను పిలిచామని, ఫతుల్లాగూడలో ఎనిమల్‌ కేర్‌ సెంటర్‌ పనులు పూర్తికాగానే.. ఆటోనగర్‌ వాసులు ఎదుర్కోంటున్న సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ఆటోనగర్‌తో పాటు, మౌలాలి సమీపంలో బార్క్‌ అందించే సాంకేతిక సహాయంతో ఐదు టన్నుల సామర్థ్యం గల బయో మెథనైజేషన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నామన్నారు.
రెండు వారాల్లో జీడిమెట్ల రీసైక్లింగ్‌ ప్లాంట్‌..
రోజుకు 500 మెట్రిక్‌ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసేందుకు జీడిమెట్లలో ఏర్పాటు చేసిన ప్లాంట్‌ను 15 రోజుల్లో ప్రారంభిచనున్నామని కమిషనర్‌ తెలిపారు. ఫతుల్లాగూడలోనే ప్రతిపాదిత సీఅండ్‌డీ ప్లాంట్‌ ఏర్పాటు స్థలాన్ని పరిశీలించి మాట్లాడిన ఆయన జీడిమెట్ల ప్లాంట్‌ పనులు 90 శాతం పూర్తయ్యాయని, దీనిని త్వరలోనే ప్రారంభించనున్నామన్నారు. ఫతుల్లాగూడ టెండర్లు పూర్తికాగానే శంషాబాద్‌, శేరిలింగంపల్లిలోని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...