ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల అదుపులో..భూతవైద్యుడు..?


Mon,June 17, 2019 03:43 AM

వెంగళరావునగర్ : భూత వైద్యం పేరిట ఓ యువతి పై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు ఆజంను ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తికి రాజభోగాలు అందించడం, లోతైన దర్యాప్తు జరుపకుండా ఉండేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగారు. ఏకంగా గతంలో ఇక్కడ ఎస్సైగా పనిచేసి, ప్రస్తుతం మరో జిల్లాలో పనిచేస్తున్న సదరు అధికారి, ఇక్కడి అధికారులతో పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. బోరబండ ప్రాంతానికి చెందిన దంపతులు ఏ పనిచేసినా మంచి జరుగడంలేదని కూతురు(19) తో కలిసి నెల రోజుల క్రితం మల్లేపల్లిలోని భూత వైద్యుడిగా చెప్పుకుంటున్న ఆజం అనే వ్యక్తి ఇంటికి వెళ్లారు. మీ ఇంట్లో దయ్యం ఉందని, దాన్ని బంధిస్తే తప్పా మీకు మంచి జరుగదని భయపెట్టాడు. దీంతో 23 రోజుల క్రితం బాధిత యువతి ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశాడు. అనంతరం బాధితురాలితో పాటు వారి తల్లిదండ్రులను బీదర్‌లోని ఓ దర్గాకు తీసుకుపోయాడు. తనను పెండ్లి చేసుకోవాలని, లేని పక్షంలో నీ తల్లిదండ్రులు చనిపోతారని భయపెట్టాడు. ఈ క్రమంలో ఈ నెల 11న బోరబండలో ఉంటున్న బాధిత యువతి ఇంటికి వచ్చి యువతిని బెదిరించి లైగికదాడికి పాల్పడ్డ విషయం పాఠకులకు విధితమే.. ఈ మేరకు బాధితురాలు తన పెద్దమ్మతో కలిసి ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు కాగానే నిందితుడు అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆదివారం నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. భూతవైద్యుడిగా చెప్పుకుంటున్న ఆజం నాంపల్లిలోని ఓ దర్గా సమీపంలో భూత వైద్యురాలిగా ఉంటున్న ఓ మహిళకు శిష్యరికం చేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఆజంను అదుపులోకి తీసుకోగానే మధ్యవర్తులు ఎస్‌ఆర్‌నగర్ పోలీసులతో రాయబారాలకు దిగినట్లు సమాచారం. దీంతో అదుపులోకి తీసుకున్న నిందితుడిని వెంటనే కోర్టులో హాజరుపరిచే విధంగా పైరవీకారులు ఇక్కడ పనిచేసి వెళ్లిన ఓ ఎస్సై ద్వారా బేరం కూడా కుదుర్చినట్లు తెలిసింది.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...