ప్రధాన మంత్రి ఉపాధి పథకం..


Sun,June 16, 2019 02:07 AM

-రుణాలకు దరఖాస్తు స్వీకరణ
రంగారెడ్డి జిల్లా,నమస్తే తెలంగాణ : ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం 2019-20 ఆర్థిక సంవత్సరానికి స్వయం ఉపాధి రుణాలు పొందేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ రాజేశ్వర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం జిల్లాలో జిల్లా పరిశ్రమ కేంద్రం (డీఐసీ)ఖాదీ,గ్రామ పరిశ్రమల కమీషన్‌(కేవీఐసీ),ఖాదీ,గ్రామ పరిశ్రమల బోర్డు(కేవీఐబీ) ద్వారా అమలు అవుతుందన్నారు. ఆర్థిక సంవత్సరానికి గాను లక్ష్యం ఇవ్వడం జరిగిందన్నారు. దరఖాస్తులను www.kviceonline.gov.in pmegp portaal.వెబ్‌ సైట్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందకు చివరి తేదీ జూన్‌ 29 వరకు ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా స్థాయి టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ అర్హత గల అభ్యర్థుల ఎంపిక చేసి బ్యాంకులకు పరిశ్రమల స్థాపనకు తగిన ఆర్థిక సహాయం పంపడం జరుగుతుందన్నారు. అర్హత గల అభ్యర్థులకు వయస్సు 18సంవత్సరాల పైబడి ఉండాలన్నారు. గరిష్ట వయో పరిమితి గానీ ఆదాయ పరిమితి గాని లేని,ఒక కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథకం కింద అర్హులన్నారు. ఇంతకు ముందు ఈ పథకం కింద లబ్ధి పొందిన అభ్యర్థులు అనర్హులని తెలిపారు. రూ.10 లక్షల పైన ఉత్పత్తి యూనిట్‌, రూ.5లక్షల పైన సేవ యూనిట్‌ స్థాపించే వారు కనీసం 8వ తరగతి పొంది ఉండలన్నారు. మరిన్ని పూర్తి వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ)లో ఐపీవో శివకృష్ణ ఠాగూర్‌ 9652866678ను జిల్లా కలెక్టరేట్‌లో సంప్రదించాలన్నారు.

80
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...