ఫొటోగ్రఫీ రంగంలో భగవన్‌దాస్‌ సేవలు ఎనలేనివి


Sat,June 15, 2019 12:39 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఫొటోగ్రఫీ రంగంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌, దివంగత అధికారి డాక్టర్‌ ఎన్‌ భగవన్‌దాస్‌ సేవలు ప్రపంచాన్ని ఆకర్శించాయని పలువురు వక్తలు అభి ప్రాయపడ్డారు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ కాలేజీలో శుక్రవారం తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్‌ ఎన్‌ భగవన్‌ దాస్‌ సెంటెనరీ సెలబ్రేషన్స్‌ సం దర్భం గా ఫొటోఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫొటోగ్రఫీ అకాడమీ అధ్యక్షుడు జనార్దన్‌ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్‌ ఎన్‌ భగవన్‌దాస్‌ తనకిష్టమైన ఫొటో రంగంలో ఎంతగానో రాణించాడని, అద్భుతమైన ఫొటోలను తన కెమెరాతో బం ధించి జాతీయ, అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నారని తెలిపారు.

అనంతరం ఫొటోగ్రఫీ సెక్రటరీ విశ్వేంధర్‌ రెడ్డి మాట్లాడుతూ ఫొటోగ్రఫీ విద్య అంటూ తెలియని రోజుల్లో డాక్టర్‌ ఎన్‌ భగవన్‌దాస్‌ ఏకంగా ఫొటోగ్రఫీ కోర్సును ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కిందని కొనియాడారు. జేఎన్‌టీయూ కాలేజీ ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ మా ట్లా డుతూ ఈ రోజు ఫొటోగ్రఫీ కోర్సులో విద్యార్థులు రాణిస్తున్నారంటే డాక్టర్‌ ఎన్‌ భగవన్‌ దాస్‌ కృషియే కారణమని చెప్పారు. అనంతరం నెహ్రూ ఆర్ట్‌ గ్యాలరీలో ఏర్పాటు చేసిన డాక్టర్‌ ఎన్‌ భగవన్‌దాస్‌ ఎగ్జిబిషన్‌ ఎంతగానో ఆకట్టుకుంది. పక్షులు, చెట్లు, తీక్షణంగా చూస్తున్న మనుషులు, ఎడారీలో విభిన్న రూపాలు తదితర ఫొటోలను ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని ఎగ్జిబిషన్‌ను తిలకించారు. 30 ఏళ్లు ఐఏఎస్‌ అధికారిగా సేవలందించిన డాక్టర్‌ ఎన్‌ భగవన్‌ దాస్‌..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలో చీఫ్‌ సెక్రటరీగా పనిచేశారు. రిటైర్డ్‌ అనంతరం మూడేళ్లు విజిలెన్స్‌ కమిషనర్‌గా పనిచేశారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...