ప్రతిఏటా.. మెరుగుపడుతూ..సత్ఫలితాలను సాధిస్తూ..


Fri,June 14, 2019 12:51 AM

మేడ్చల్ రూరల్ :శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాలుగేండ్లలో గణనీయ పురోగతి సాధించింది. పాఠశాల నాణ్యతా ప్రమాణాలకు గీటురాయి పదవ తరగతి ఫలితాలు. ఉత్తీర్ణతా శాతం పెరగడంతో పాటు అత్యధిక జీపీఏతో పాఠశాల విద్యార్థులు సత్తా చాటుతున్నారు. 2014-15 విద్యా సంవత్సరంలో టెన్త్‌లో 29 శాతం, 2015-16లో 76 శాతం, 2016-17లో 67.5 శాతం, 2018-19లో 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, 2018-19లో 92 శాతానికి చేరింది. గత విద్యా సంవత్సరంలో పాఠశాలకు చెందిన వరెల్లి అనే విద్యార్థి 10/10 జీపీఏ సాధించి జిల్లా కలెక్టర్ మన్ననలు అందుకుంది. అదే ఏడాది మరో ఇద్దరు విద్యార్థులు 9.2 జీపీఏ సాధించారు. ఈ విద్యా సంవత్సరంలో అభిషేక్‌రెడ్డి 9.8, శ్రావణి 9.7 జీపీఏ సాధించి పాఠశాలకు పేరు తీసుకువచ్చారు. నేషనల్‌మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్(ఎన్‌ఎంఎస్‌ఎస్)కు కూడా ప్రతి సంవత్సరం విద్యార్థులు ఎంపికవుతున్నారు. గత ఏడాది ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు.

తల్లిదండ్రుల ఆసక్తి
శ్రీరంగవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇటు తెలుగు, అటు ఆంగ్ల మాద్యమాల్లో ఉత్తమ ఫలితాలను సాధిస్తుండడంతో తల్లిదండ్రులు ఈ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పైసా ఖర్చు లేకుండా బోధించడంతో పాటు ఉచితంగా పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం, హెల్త్‌కిట్స్ అందించడం కూడా కలిసి వస్తున్నది. ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ కారణాల దృష్ట్యా గ్రామానికి చెందిన దాదాపు 40 మంది విద్యార్థులు వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి జడ్పీహెచ్‌ఎస్‌కు మారడం గమనార్హం.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...