దాహం తీరుస్తున్న భగీరథ


Mon,May 27, 2019 02:41 AM

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ: మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలకు అధికారులు చెక్ పెట్టారు. వేసవిలో తాగునీటి ఎదడి తీవ్రం కావడంతో ఆయా వార్డుల నుంచి నీటి కోసం ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ పరిస్థితిలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్ది ప్రత్యేక చొరువ తీసుకుని మున్సిపల్, మిషన్ భగీరథ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో తీవ్ర నీటి ఎదడి నెలకొని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నందున ప్రస్తుతం మున్సిపాలిటీకి ఇస్తున్న నీటిని పెంచాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. దీంతో స్పందించిన అధికారులు ప్రతిరోజు అదనంగా పది నుంచి పదిహేను లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం వచ్చే నీటితో పాటు అదనంగా ఇస్తున్న నీటిని కలిపి మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డులకు పూర్తిస్థాయిలో నీటి సరఫరా చేస్తున్నారు. గత మూడు రోజులుగా మున్సిపాలిటీ పరిధిలోని ఇబ్రహీంపట్నం, శేరిగూడ, ఖానాపూర్, సీతారాంపేట్ గ్రామాలకు పూర్తిస్థాయిలో నీటిని అందజేస్తున్నారు.

ప్రతిరోజూ ముప్పై నుంచి ముప్పైరెండు లక్షల లీటర్ల నీరు సరఫరా
మున్సిపాలిటీలోని ప్రస్తుత జనాభాకు మిషన్ భగీరథ అధికారులు ప్రతిరోజు ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల లీటర్ల నీటిని అందిస్తున్నారు. గతంలో మున్సిపాలిటీకి పదిహేను నుం చి ఇరవై లక్షల లీటర్లు మాత్రమే నీటిని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఉన్న జనాభాకు ప్రతిరోజూ సుమారు ముప్పై లక్షల లీటర్ల నీరు అవసరముంటుందని తెలుసుకున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ఆ నీటిని అందించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతిరోజూ మున్సిపాలిటీలో ముప్పై నుంచి ముప్పై రెండు లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తుండడంతో ఎక్కడ సమస్య తలెత్తడంలేదు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి వస్తున్న నీటిని ఇరవై వార్డుల్లో సమానంగా పంపిణీచేయడం కోసం వాటర్ సప్లయ్ సిబ్బందికి తగు ఆదేశాలు జారీచేశారు. దీంతో వేసవిలో నీటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.
అందరికి సరిపడా నీరు : ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి
ఇబ్రహీంపట్నం, సీతరాంపేట్, ఖానాపూర్, శేరిగూడ గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు గతంలో అందించే నీటి కంటే రెండింతలు అదనంగా సరఫరా చేస్తున్నం. నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నాం. మున్సిపాలిటీలో పనిచేసే కిందిస్థాయి సిబ్బంది సక్రమంగా నీటిని సరఫరా చేయడం లేదని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. దీంతో స్పందించి వేసవిలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తున్నాం. ఎక్కడైనా నీటి సమస్య తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీలోని ఖానాపూర్‌గేటు సమీపంలో గల మిషన్ భగీరథ తాగునీటి ట్యాంకు ద్వారా అన్ని కాలనీలకు నీటిని సరఫరా చేస్తున్నాం.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...