పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత


Mon,May 27, 2019 02:40 AM

షాద్‌నగర్‌టౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ని, పరిసరాలను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని షాద్‌నగర్ మున్సిపల్ కమిషనర్ శరత్‌చంద్ర పట్టణవాసులకు సూచించారు. షాద్‌నగర్ మున్సిపాలిటీలోని చటాన్‌పల్లిలో ఆదివారం పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగా ప్రదేశాలలో మలమూత్ర విసర్జన చేయకుండా ప్రతిఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్లను తప్పకుండా నిర్మించుకోవాలన్నారు. మున్సిపాలిటీలోని నివాసాల, వ్యాపార సముదాయాలు, స్కూల్స్, కాలేజీ, కల్యాణమండపాల యజమానులు బహిరంగా ప్రదేశాలలో చెత్తను వేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంతేకాకుండా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని, నిషేదిత ప్లాస్టిక్ కవర్లను వినియోగించరాదన్నారు. నివాసాల సమీపంలో ఎలాంటి చెత్తను కాల్చరాదని, వాటిని కాల్చడం ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుందనే విషయాన్ని పట్టణవాసులు గ్రహించాలన్నారు. పట్టణ పరిశుభ్రత కోసం వార్డులవారీగా పరిశుభ్రత వార్డు పోటీని నిర్వహించడం జరుగుతుందన్నారు. అదే విధంగా మున్సిపాలిటీలోని ఏ వార్డుల్లో కూడా నీటి సమస్యను రానివొద్దని మున్సిపల్ అధికారులకు సూచించారు. పట్టణ పరిశుభ్రత కోసం మున్సిపల్ కార్మికులకు పట్టణవాసులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మణెమ్మ, మున్సిపల్ అధికారులు నర్సింహులు, నగేశ్ పాల్గొన్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...