జోరు తీన్‌మార్


Fri,May 24, 2019 04:46 AM

-జిల్లా పరిధిలోని మూడు పార్లమెంట్ టీఆర్‌ఎస్ విజయం
-చేవెళ్లలో నాగర్‌కర్నూల్ రాములు, మహబూబ్‌నగర్ శ్రీనివాస్‌రెడ్డి
-టీఆర్‌ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీ
-ఉత్కంఠగా సాగిన చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు
-జిల్లావ్యాప్తంగా గులాబీ శ్రేణుల సంబురాలు
-భువనగిరిలో స్వల్ప తేడాతో కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బంపర్ మెజార్టీతో గెలిపించిన జిల్లా ప్రజలు.. స్థానాల్లోనూ ఆ పార్టీకే పట్టం కట్టారు. జిల్లా పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాలుండగా, మూడింట్లో గులాబీ అభ్యర్థులు గెలుపొందారు. మొదట్నుంచీ తీవ్ర ఉత్కంఠగా సాగిన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో చివరకు టీఆర్‌ఎస్ అభ్యర్థినే విజయం వరించింది. గ్రామీణ ఓటర్లు కొంతవరకు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపగా, పట్టణ ఓటర్లు వన్‌సైడ్‌గా కారు వైపు నిలిచారు. సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిపై 14,391 ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్‌రెడ్డి గెలుపొందారు. అదేవిధంగా, ఎంపీగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఓట్ల మెజార్టీతో బీజేపీ డీకే విజయం సాధించారు. నాగర్‌కర్నూల్ ఎంపీగా టీఆర్‌ఎస్ పి.రాములు లక్షల భారీ మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 5,219 మెజార్టీతో గెలుపొందారు. మెజార్టీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా జరుపుకున్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లోనూ అధికార పార్టీ టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. చేవెళ్ల గడ్డపై గులాబీ జెండా రెపరెపలాడింది. ప్రతి రౌండ్‌లోనూ గులాబీకి పూర్తి ఆధిక్యత లభించింది. చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి 14,391 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై గెలుపొందారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధిక మెజార్టీ వచ్చింది. రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి మంచి మెజార్టీ రాగా, వికారాబాద్, చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ పార్టీకి నష్టం జరిగింది. గ్రామీణ నియోజకవర్గాల్లో తాండూర్ నియోజకవర్గం మినహా వికారాబాద్, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ లభించింది. అదే విధంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 12,99,715 ఓట్లు లెక్కించగా టీఆర్‌ఎస్ పార్టీకి 5,28,010 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 5,13,619 ఓట్లు, బీజేపీకి 2,01,856 ఓట్లు వచ్చాయి. అదే విధంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించి మొత్తం 1241 ఓట్లు కాగా కాంగ్రెస్‌కు 651, టీఆర్‌ఎస్‌కు 270, బీజేపీకి 296, నోటాకు 9 మంది పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారు. 43 రౌండ్లు కొనసాగింది. టీఆర్‌ఎస్‌కు 14,391 ఆధిక్యం వచ్చింది.

2008లో నియోజకవర్గం ఏర్పాటు..
చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2008లో ఏర్పాటుకాగా 2009లో తొలిసారి ఎన్నికలు జరుగగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన జైపాల్ రెడ్డి టీడీపీ అభ్యర్థి జితేందర్ రెడ్డిపై 18,532 ఓట్ల మెజార్టీతో గెలుపొంది చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ తొలి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 4,20,807 ఓట్లురాగా(38.78 శాతం), టీడీపీ అభ్యర్థికి 4,02,275 ఓట్లు(37.08 శాతం), బీజేపీ అభ్యర్థికి 1,02,701 ఓట్లు(10.39 శాతం) పోలయ్యాయి. తదనంతరం 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా ఎన్నికయ్యారు. తాజాగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ఎంపీగా డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి ఎన్నికయ్యారు.

తొలిసారి ఎంపీగా...
డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. డాక్టర్ రంజిత్ రెడ్డి స్వస్థలం వరంగల్ జిల్లా. రాజేంద్రనగర్‌లోని ఏజీ రంగా వ్యవసాయ యూనివర్సిటీలో వెటర్నరీ సైన్స్‌లో యూజీ, పీజీ పూర్తి చేశారు. తదనంతరం రంజిత్ రెడ్డి చేవెళ్ల మండలం అంతారంలోని పౌల్ట్రీ ఫార్మ్‌లో టెక్నాలజీ సలహాదారుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆరేండ్ల పాటు టెక్నాలజీ సలహాదారుగా పనిచేసిన ఆయన.. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాన్ని సంపాదించిన ఆయన డాక్టర్ తిరుపతిరెడ్డితో కలిసి ఎస్‌ఆర్ హచ్చెరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పౌల్ట్రీ పరిశ్రమను ప్రారంభించారు. తదనంతరం పౌల్ట్రీ పరిశ్రమ విజయవంతం కావడంతో చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో ఎన్నో పౌల్ట్రీ పరిశ్రమలను రంజిత్ రెడ్డి నెలకొల్పారు. ఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రంజిత్ రెడ్డి.. తెలంగాణతోపాటు దేశంలోనే పౌల్ట్రీ పారిశ్రామిక రంగంలో ప్రధాన శక్తిగా తయారయ్యారు. అంతేకాకుండా తెలంగాణ పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్న ఆయన పౌల్ట్రీ పరిశ్రమల్లో సంక్షోభం నెలకొన్న సమయంలో ప్రభుత్వానికి సమస్యలను వివరించి పరిష్కారం చూపడంలో కీలకంగా వ్యవహరించారు.

అంతేకాకుండా తన గ్రూప్ కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పించారు. అదేవిధంగా ఎవరికైతే ప్రాథమిక విద్యను పొందే అవకాశంలేని వారికి వృత్తి నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి కల్పిస్తున్నారు. అంతేకాకుండా రంజిత్ రెడ్డి పౌల్ట్రీ పరిశ్రమలతోపాటు గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందించేందుకుగాను ఇంజినీరింగ్, వైద్య కాలేజీలను కూడా ప్రారంభించారు. 2004లో టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వం పొందిన రంజిత్ రెడ్డి అప్పటినుంచి వ్యాపారంతోపాటు పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తున్నారు. అంతేకాకుండా చేవెళ్ల ప్రాంతంలో ఎస్‌ఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరిట ఎన్నో పౌల్ట్రీ పరిశ్రమలను నెలకొల్పడంతోపాటు చాలా గ్రామాలను దత్తత తీసుకొని వేలాది కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించడంతోపాటు జీవనోపాధి కల్పిస్తున్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంత ప్రజలకు సుపరితులైన డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎంపీగా గెలిపించి ఆశీర్వదించారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...