గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు


Tue,May 21, 2019 11:45 PM

కొందుర్గు: జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కొందుర్గు, జిల్లెడ్‌చౌదరిగూడ మండలంలోని గ్రామాల్లో నాలుగు రోజులుగా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొందుర్గు మండల కేంద్రంతో పాటు మండలంలోని తంగెళ్లపల్లి, విశ్వనాథ్‌పూర్, వెంకిర్యాల, జిల్లెడ్‌చౌదరిగూడ మండలంలోని ఇంద్రానగర్, పెద్ద ఎల్కిచర్ల, వీరన్నపేట, పద్మారం తదితర గ్రామాల్లో మంగళవారం పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని మురుగుకాలువలను శుభ్రం చేయించారు. గ్రామంలో కంప చెట్ల తొలగింపు కార్యక్రమాలు చేశారు. నల్లా పైప్‌లైన్ మరమ్మత్తులు చేపట్టారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేపడితే వర్షాకాలంలో వ్యాధులను దూరం చేసే వీలుందని ఈఓఆర్‌డి యాదగిరిగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కమ్మరి భూపాలచారి, మహబూబీ, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

లింగారెడ్డిగూడలో స్వచ్ఛభారత్
షాద్‌నగర్‌టౌన్ : స్వచ్ఛభారత్ కార్యక్రమంలో యువత భాగస్వామ్యం అవసరమని ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సర్పంచ్ మాధవిరామకృష్ణ అన్నారు. గ్రామంలోని మురుగుకాలువలను, రోడ్డులు, వీధులను శుభ్రం చేశారు. గ్రామంలో పారిశుధ్య సమస్యలు రాకుండా అందరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు నర్సింలు, మల్లేశ్, బలరాం, నర్సింలు, శశాంక్, శ్రీశైలం,చందు, పోచయ్య, పాషా, లింగం, విఠల్, లక్ష్మయ్య, సురేశ్, జంగయ్య, మల్లేశ్, రవి, మహేశ్, నాగేశ్, అశోక్ పాల్గొన్నారు.

వెంకమ్మగూడ అభివృద్ధికి ప్రణాళికలు
నందిగామ : వెంకమ్మగూడ అభివృద్ధికి తగు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెంకమ్మగూడ సర్పంచ్ రజినీత వీరేందర్‌గౌడ్ అన్నారు. మండల పరిధిలోని వెంకమ్మగూడ గ్రామంలో మంగళవారం గ్రామసభ నిర్వహించి గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వెంకమ్మగూడ గ్రామంలోని ఇప్పటికే ప్రతి కాలనీలో ఎల్‌ఈడీ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పనులు త్వరగా పూర్తి చేసి తాగు నీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మధు, వార్డు సభ్యులు కవితశ్రీనివాస్, సములయ్య, శోభారాణి, దేవప్ప, చంద్రకళ, నర్సింలు, యాదమ్మ, గ్రామస్తులు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...