ఆసరా @ 57


Tue,May 21, 2019 12:15 AM

-ఎన్నికల హామీ మేరకు అర్హత వయస్సును తగ్గించిన సీఎం కేసీఆర్‌
-జిల్లాలో 57 నుంచి 64 సంవత్సరాల మధ్య 1,72,052 మంది ఉన్నట్లు అంచనా
-57 ఏండ్లు నిండి ఎలాంటి పింఛన్‌ పొందని వారు 31,947
-లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు
-గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో బిల్‌ కలెక్టర్లకు బాధ్యతలు
-వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం
రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : వృద్ధాప్య పిం ఛన్‌ వయస్సు తగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకనుంచి 57 ఏండ్లు నిండిన వృద్ధులు ప్రతినెల పింఛన్‌ అందుకునే వెసులుబాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి వారంరోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో వృద్ధాప్య పింఛన్‌ వయస్సు 65 ఏండ్లుగా ఉండగా ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ దిశ గా ఆదేశాలిచ్చారు. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు కొద్దిరోజుల క్రితం విడుదల చేసింది. నూతన మార్గదర్శకాలు జిల్లా అధికారులకు అం దాయి. దానిప్రకారం ఆసరా పింఛన్‌ లబ్ధిదారుల ఓటర్‌కార్డులోని వయస్సు ప్రమాణికంగా తీసుకుని పింఛన్‌కు ఎంపిక చేయనున్నారు. జిల్లాలో 57 ఏండ్ల నుంచి 64ఏండ్ల లోపు ఎంతమంది ఉన్నా రు.

ఎంతమంది ఆసరా పథకానికి అర్హులు కానున్నారనే వివరాలు ఆయా మండలాలవారీగా లెక్క తేల్చారు. అయితే అర్హత వయస్సు నిండిన వారందరికీ వారం రోజుల్లో నిర్ణయం తీసుకోనుందని సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1న పింఛన్‌ సొమ్ము చేతికందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ ఎన్నికల కోడ్‌ ఉండడంతో ఆలస్యమైంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పింఛన్‌ మంజూరుకు ఓటరు కార్డులోని వయస్సు ప్రమాణికంగా తీసుకుంటున్నందున 2018 సెప్టెంబర్‌ 19 నాటికి 57ఏండ్లు నిండిన వారందరూ అర్హులే. ఈ లెక్కన జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సం బంధించి 1,72,052మంది వృద్ధులు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వీరే కాకుండా ఆయా అసెంబ్లీ నియోజకవర్గంలో 31,947మంది ఎలాంటి పింఛన్‌ పొందలేదని అధికారులు గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో అన్ని రకాల పింఛన్‌ లబ్ధిదారులు ప్రస్తుతం 1,73,635 మంది ఉన్నారు. కొత్తవాటిని కలుపుకుంటే ఈ సంఖ్య మరింత పెరగనుంది.

పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ ...
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం లబ్ధిదారుల ఎం పిక పారదర్శకంగా జరగనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఎంపికకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. గ్రామాల్లో వీఆర్వోలు, పట్టణాల్లో అయితే బిల్‌ కలెక్టర్లు లబ్ధిదారుల ఎం పిక ప్రక్రియలో పాల్గొంటారు. ఇలా ఎంపికచేసిన జాబితాను గ్రామ సభల ద్వారా ప్రదర్శిస్తారు. లబ్ధిదారుల ఆధార్‌ నంబర్‌, బ్యాంక్‌ ఖాతా, ఫొటోను, పంచాయతీ కార్యదర్శులు, బిల్‌ కలెక్టర్లు సేకరిస్తారు. గ్రామాల్లోని లబ్ధిదారుల జాబితాను ఎంపీడీఓలు, పట్టణ లబ్ధిదారుల జాబితాను కమిషనర్లు ప్రస్తుతం ఉన్న ఆసరా సాప్ట్‌వేర్‌లో లబ్ధిదారుల వివరాలు అప్‌లోడ్‌ చేయనున్నారు. ఇప్పటికే జిల్లా గ్రామీణాభివృద్ధిసంస్థ నేతృత్వంలో పింఛన్లు పొం దుతున్నారు. 2014నవంబర్‌ నుంచి ఆసరా పిం ఛన్లు ద్వారా వృద్ధాప్య, వితంతు, గీత కార్మికులు, చేనేత కార్మికుల పింఛన్లకు ఒక్కో పింఛన్‌దారులకు ప్రతి నెల రూ.వెయ్యి, వికలాంగుల పింఛన్‌దారులకు రూ.1500 చొప్పున చెల్లిస్తున్నారు. బీడీ కార్మికులకు రూ.వెయ్యి మంజూరు చేస్తున్నారు.

94
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...