మాయ‘దారులు’


Tue,May 21, 2019 12:13 AM

మణికొండ, మే20 (నమస్తే తెలంగాణ): గచ్చిబౌలి నుంచి శంషాబాద్‌ వరకు వెళ్లే అవుటర్‌ సర్వీస్‌రోడ్డు నార్సింగి టి జంక్షన్‌ వద్ద ఉన్న మలుపులు యమపురికి దారులను తలపిస్తున్నాయి. అధికారులు నిర్లక్ష్యం తో ఆ మలుపుల వద్ద ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నా యి. మలుపుల వద్ద జరిగిన ప్రమాదాల్లో చాలా మం ది మృత్యువాత పడ్డారు. ఎదురుగా వచ్చే వాహనాల నియంత్రణ చేసుకునే వీలు లేకుండా అక్కడ ఎలాంటి సూచికబోర్డులు, స్పీడ్‌ బ్రేకర్లు కానీ ఏర్పాటు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో మృతుల బంధువులు అధికారులను నిలదీసినప్పటికీ స్పందించిన దాఖలాలు లేవు. రేడియల్‌ రోడ్డు అధికారులు పనితీరు బాగోలేదని రోడ్డువేసే సమయంలోనే స్థానికులు ఆరోపించారు. అయినా వినిపించుకోకుండా ఈ సర్వీసురోడ్డును నిర్మించడంతో ప్రస్తుతం ప్రమాదాలకు నెలవుగా నార్సింగి జంక్షన్‌ మలుపులు మారా యి. గతంలో ఓ ఐటీ ఉద్యోగి ఇదే మలుపులో లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. అదేవిధం గా ఇద్దరు భార్యభర్తలు ప్రమాదాలు గురైయ్యారు. ఓ యువతి అక్కడిక్కడే మృతిచెందింది. ఇదే మలుపు వద్ద గతంలో ప్రస్తుత రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి టి.హరీశ్‌రావు కారును ఎదురుగా వచ్చిన వ్యక్తి ఢీకొట్డాడు. ఈ ప్రమాదంలో హరీశ్‌రావు కూడా తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రమాదాలు అనేకం జరిగినప్పటికీ అధికారుల్లో మాత్రం ఎలాంటి చలనం లేకపోవడం విచారకరం. వాహనాలు ఆ ప్రదేశానికి వచ్చేటప్పుడు మితిమీరిన వేగంతో రావడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని గతంలో పలువురు అధికారులకు విన్నవించినా ఏమాత్రం స్పందించకపోవడంతో పాటు కనీసం ఆఛాయలకు కూడా వెళ్లి ప్రమాద మలుపులను పరిశీలించిన దాఖలాలు లేకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఉన్నతాధికారులు సకాలంలో స్పందించి నార్సింగి టి జంక్షన్‌ వద్దనున్న మలుపులకు ప్రత్యామ్నాయంగా పక్కనే ఉన్న ఖాళీ స్థలాలను చదునుచేసి ప్రమాదాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

60
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...