సమగ్ర సర్వేకు రైతులు సహకరించాలి


Sun,May 19, 2019 02:15 AM

చేవెళ్ల: రైతు సమగ్రసర్వేకు అందరూ సహకరించాలని మండల వ్యవసాయ విస్తరణ అధికారి శివ తెలిపారు. చేవెళ్ల మండల పరిధిలోని చన్‌వల్లి గ్రామంలో రైతు సమ గ్ర సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పంటల వివరాలను రైతుల నుంచి పూర్తి వివరాలను సేకరించారు. గ్రామంలో స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి వ్యవసాయ అధికారుల వద్ద తమ వివరాలను నమో దు చేయించుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... అన్ని రకాల పంటల పేర్లు, లోన్‌ వివరాలను తెలియజేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం క్రాపుకాలనీలు ఏర్పాటు చేయడంతోపాటు రైతులకు సబ్సిడీలను అందించే అవకాశం ఉందని చెప్పారు. రైతులు పట్టా పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ ఖాతా వివరాలను తెలియజేయాలని ఆయన సూచించారు. రైతులంతా సమగ్ర సర్వేను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, నాయకులు, గ్రామస్తులు తదితరు ఉన్నారు.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...