ఉన్నత చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు


Sun,May 19, 2019 02:14 AM

-సర్పంచ్‌ మల్లేశ్‌, ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి
-ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సన్మానం

షాబాద్‌, నమస్తే తెలంగాణ/మొయినాబాద్‌: గ్రామీణ ప్రాం తాల్లో ఉండే విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉజ్వల భవిషత్తును నిర్మించుకోవాలని హైతాబాద్‌ సర్పంచ్‌ మల్లేశ్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి అన్నారు. మండల పరిధిలోని హైతాబాద్‌ ఉన్నత పాఠశాలలో పదోతరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చిన హైతాబాద్‌ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు నీరజ 9.8, హరిణి 9.8జీపీఏలు సాధించారు. వారిని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ సూద యాదయ్య అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వ పాఠశాలలకు మంచి గుర్తింపుతేవడం సంతోషకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎంతో నైపుణ్యంతో కూడిన వారు ఉన్నారని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీ ణ ప్రాంతాల్లో ఉండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు దేనిలో తక్కువకాదని నిరూపించారని చెప్పారు. విద్యార్థులు తమ ప్రాథమిక విద్య దశ నుంచే ఓ లక్ష్యాన్ని పెట్టుకుని చదువుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తామని అన్నారు.

విద్యార్థులకు పట్టుదల, కృషి, సహ నం, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఈ పాఠశాల విద్యార్థులు నిరూపించారని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయలక్ష్మి ప్రత్యేక చొరవ తీసుకుని పక్కా ప్రణాళికతో ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయించడం వల్ల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని పేర్కొన్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...