ఎం- వ్యాలెట్‌కు అపూర్వ స్పందన


Thu,May 16, 2019 11:45 PM

-60 లక్షలు దాటిన డౌన్‌లోడ్స్‌
సిటీబ్యూరో: ఐటీ ఇన్నోవేషన్‌గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్‌టీఏ ఎం-వ్యాలెట్‌కు అపూర్వ స్పందన లభిస్తున్నది. అప్పటి ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ మార్చి 30, 2016న ప్రారంభించారు. ఈ యాప్‌ ద్వారా వాహనదారులు తమ డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా ఆర్‌సీనీ డౌన్‌లోడ్‌ చేసుకొని ఉండాల్సి ఉంటుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖలైన రవాణాశాఖ అధికారులు , పోలీసు విభాగం తనిఖీలు చేసినప్పుడు మొబైల్‌లో ఉన్న యాప్‌లో నిక్షిప్తమై ఉన్న డిజిటల్‌ డాక్యుమెంట్లను చూపిస్తే సరిపోయేలా ఆర్‌టీఏ -ఎం-వ్యాలెట్‌ను రూపొందించారు. దీంతో చాలా మంది ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని వినియోగించుకున్నారు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రవాణాశాఖాధికారులతోపాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన మోర్త్‌ కూడా దీనిపై అధ్యయనం చేసి ఎం వ్యాలెట్‌ను పోలిన యాప్‌లను ప్రవేశపెట్టారు. రవాణాశాఖలో వెండర్‌ వల్ల ఇబ్బందులు ఏర్పడి స్మార్ట్‌కార్డుల కొరత రావడం కూడా యూజర్ల సంఖ్య పెరుగడానికి కారణమైంది.

60 లక్షలు దాటిన యూజర్లు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్టమొదటి గొప్ప ఐటీ ఇన్నోవేషన్‌గా ప్రఖ్యాతిగాంచిన ఆర్‌టీఏ -ఎం వ్యాలెట్‌కు తక్కువ సమయంలోనే ఎక్కువ యూజర్లు వినియోగిస్తున్నారు. అమల్లోకి తెచ్చిన మూడు సంవత్సరాల 15 రోజుల్లో 29,73,242 మంది యూజర్లను సంపాదించింది. ఆర్‌టీఏ ఎం వ్యాలెట్‌లో డౌన్‌లోడ్స్‌ 60,85,200 ఉన్నాయి.

30
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...