సాగులో అత్యాధునిక పరిజ్ఞానం అవసరం


Thu,May 16, 2019 12:31 AM

పేట్‌బషీరాబాద్‌ : పంటల సాగులో అత్యాధునిక పరిజ్ఞానం అవసరమని ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఐఏఎస్‌ సి.పార్థసారథి అన్నారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం జీడిమెట్ల పైప్‌లైన్‌ రోడ్డులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో శ్రీకొండా లక్ష్మణ్‌ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం, ఉద్యాన శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తాధ్వర్యంలో బుధవారం జరిగిన ఉద్యాన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ప్రస్తుత కొత్త క్యాంపస్‌లో బీఎస్సీ హార్టికల్చర్‌ (గ్రాడ్యుయేషన్‌) కళాశాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానన్నారు. రైతులు చేసే పంటసాగులో మార్పులు తీసుకురావాలని ఉద్దేశంతో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, జగిత్యాల జిల్లాల్లో మామిడి సాగుపై 2500 మంది రైతులకు అవగాహన కల్పించామన్నారు. దళారీల నుంచి విముక్తి కలిగిస్తూ నేరుగా రిటైల్‌ రంగం వారికే మామిడి పండ్లను విక్రయించేలా చేశామని, అలా చేయడం వల్ల కిలోకు రూ.15 నుంచి 20 లాభం పొందారన్నారు. అనంతరం రైతుల కోసం 7 రకాల మామిడి వంగడాలను విడుదల చేశారు. శ్రీకొండా విశ్వవిద్యాలయం వారు రూపొందించిన పంటల సాగు పుస్తకాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యాన వన శాఖ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రాంరెడ్డి, ఉద్యాన వన శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

50
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...