ఘనంగా వాసవీమాత జయంత్యుత్సవాలు


Wed,May 15, 2019 12:46 AM

ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ: కొత్తపేటలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఘనంగా శ్రీ వాసవీమాత జయంత్యుత్సవాలు నిర్వహించారు. వాసవీ క్లబ్‌లు, గడ్డిఅన్నారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వ ర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో హంపీ వీరుపాక్ష విద్యారణ్యభారతీ స్వామి, మాజీ సీఎం రోశ య్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో 108 కలశాలతో అష్టోత్తర అమ్మవారి విశేష పం చామృత సహిత సుగంధ ద్రవ్యవములచే అభిషేకం నిర్వహించారు. మహిళలచే సామూహిక కుంకు మార్చన పూజలు నిర్వహించారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో 108 ఇత్తడి గంగాళాలలో నైవేద్యం, లక్ష్య పూల పూజ, లక్ష గాజుల పూజ, లక్ష కలువ పూల పుష్పార్చన, 102 పొంగళ్లు, 102 కన్నె ముతై దువుల పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌ గుప్త, రాష్ట్ర హస్తకళా ఛైర్మన్‌ సంపత్‌కుమార్‌, అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌ గుప్త, అమరవాది లక్ష్మీనారాయణ, పబ్బ బాలయ్య, చిదర నాగేందర్‌, కాశెట్టి నాగేష్‌, మొగుళ్లపల్లి ఉపేందర్‌ గుప్త, కోట శ్రీదేవి, శ్రావణ్‌కుమార్‌, జ్యోతిలక్ష్మీ, నర్సింహయ్య, వూర శ్రీనివాస్‌, వేణుమాధవ్‌, జిన్నం వేణు, కాచం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...