జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో కారిడార్ రెడీ


Wed,April 24, 2019 03:01 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో భాగంగా కారిడార్-2లో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మార్గం సిద్ధమయింది. ఇప్పటికే మెట్రోరైలు ప్రాజెక్టులోని రెండు ముఖ్య కారిడార్లు ఎల్బీనగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు 56 కిలోమీటర్ల మార్గం ప్రారంభమయ్యాయి. కారిడార్ 2లోని జేబీఎస్-ఫలక్‌నుమా మార్గంలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు పూర్తయింది. సిగ్నలింగ్, ఎలక్ట్రిఫికేషన్, ట్రాక్‌పనులతోపాటు స్టేషన్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. వీటికి సంబంధించి ఎలక్ట్రికల్ తనిఖీలు పూర్తిచేసి కమిషనర్ ఆఫ్ మెట్రోరైలు సేఫ్టీ (సీఎంఆర్‌ఎస్) అనుమతులు రాగానే 9.66 కిలోమీటర్లు అందుబాటులోకి రానున్నది. అనుమతుల కోసం రెండునెలలు పట్టే అవకాశం ఉన్నది. ఈ మా ర్గం పూర్తయితే రెండు ప్రధాన బస్‌స్టేషన్లకు, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు కనెక్టివిటీ పెరుగనున్నది. కాగా, కారిడార్ 2కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5కిలోమీటర్ల పనులకు సంబంధించిన సర్వే కొనసాగుతున్నది.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...