స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుదాం


Tue,April 23, 2019 02:55 AM

మారేడ్‌పల్లి, సిటీబ్యూరో:హైదరాబాద్ నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిశోర్ పిలుపునిచ్చారు. సోమవారం సికింద్రాబాద్ జోనల్ మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాఫ్ హైదరాబాద్..షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమంపై జీహెచ్‌ఎంసీ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దానకిశోర్ మాట్లాడుతూ...హైదరాబాద్ గొప్ప నగరమని, ఈ నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాఫ్ హైదరాబాద్..షాన్‌దార్ హైదరాబాద్‌లో భాగంగా ప్రజలకు పరిశుభ్రత పై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 30 సర్కిళ్లలో 150 ప్రాంతాలను ఎంచుకొని అక్కడ మార్పులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తామన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 36వ స్థానం వచ్చినప్పటికీ దేశంలోని ప్రధాన నగరాల్లో మనం ముందున్నామన్నారు. సాఫ్ హైదరాబాద్..షాన్‌దార్ హైదరాబాద్ కార్యక్రమంలో ఎన్జీవోలను భాగస్వాములను చేస్తున్నామన్నారు. మొత్తం 150 వార్డుల్లో ఒక్కో వార్డులో 2500చొప్పున ఇండ్లను గుర్తించి మే ఒకటినుంచి పూర్తిస్థాయిలో స్వచ్ఛ కార్యక్రమాలు ప్రారంభించాలని ఆయన కోరారు. ఎంపిక చేసిన ప్రతి 2500 ఇండ్లకు ఒక స్వచ్ఛ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్(సీఆర్‌పీ)తోపాటు స్వచ్ఛంద సంస్థకు చెందిన ఓ ప్రతినిధిని నియమించి 18స ్వచ్ఛ అంశాల అమలుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

అదేవిధంగా ప్రజలకు అవగాహన కల్పించడం, పారిశుధ్య పనులు చేపడుతామన్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బందితో పాటు స్వచ్ఛంద సంస్థ సహకారంలో ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సాఫ్ హైదరాబాద్..షాన్‌దార్ హైదరాబాద్ నినాదంలో భాగంగా రహదారుల వెంట డెబ్రిస్ లేకుండా చూడడం, నాలాల్లో పూడిక, వ్యర్థాల తొలగింపుతో పాటు రోడ్లపై గుంతలు లేకుండా చూడడం వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ప్రతి 50 మీటర్లకు ఒకచోట తడి, పొడి చెత్తకోసం విడివిడిగా చెత్తడబ్బాలను ఏర్పాటు చేయడంతో సహా వంద కేజీలకుపైగా వ్యర్థాలను ఉత్పత్తి చేసే హోటళ్లు, ఫంక్షన్ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రఘు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...