ఆర్థిక ఇబ్బందులతో...దొంగ తనానికి స్కెచ్


Tue,April 23, 2019 02:54 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆర్థ్థిక ఇబ్బందులు పడుతున్న ఓ పాత నేరస్తుడికి.. ఓ ఆభరణాల దుకాణం యజమానిపై కోపం పెంచుకున్న ఓ మైనర్ బాలుడు తోడయ్యా డు.. ఈ ఇద్దరి ఆలోచనలు కలిశాయి.. ఇక పక్కా ప్లాన్‌తో ఆభరణాల దుకాణ యజమానిని అర్ధరాత్రి అడ్డగించి.. అతడి కంట్లో కారపుపొడి చల్లి 11 కిలోల వెండిని అపహరించారు. ఈ ముఠాను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని.. సొత్తును రికవరీ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సోమవారం మీడియాకు వివరించారు.

ఖాజీపురాకు చెందిన మహ్మద్ నిజాముద్దీన్‌కు ఇద్దరు భార్యలు, ఐదు మంది పిల్లలు. గతంలో కల్తీ నూనె లు విక్రయిస్తుండగా హుస్సేనీఆలం పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ట్రావెల్ వ్యాపారం, చికెన్ సెంటర్ నిర్వహించగా నష్టాలతో వాటిని మూసేశాడు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయడం ప్రారంభించాడు. అవి కూడా పెరిగిపోతున్నాయి. దీంతో ఎదో ఒక దొంగతనం చేసి, అప్పులు తీర్చుకోవడంతో పాటు ఆర్థికంగా కుదుటపడాలని ఆలోచిస్తున్నాడు. ఈ ఆలోచనలను తన స్నేహితుడైన, గతంలో దోపిడీ కేసులో అరెస్టయిన అదే ప్రాం తంలో నివాసముండే డ్రైవర్ మహ్మద్ ఆసిఫ్‌తో పాటు మరో మైనర్ బాలుడు ముందు చర్చించాడు. వెంటనే మైనర్ బాలుడు తాను పనిచేస్తున్న దుకాణం యజమాని అజార్‌పై తనకున్న పగను తీర్చుకోవాలనుకున్నాడు. దు కాణంలో పనిచేస్తున్న సమయంలో బంధువని కూడా చూడకుండా తిట్టిడం, తమ కుటుంబానికి ఆర్థిక సహా యం చేస్తానని మాట తప్పడం, తన తండ్రిని కూడా అవమానించడం వంటి విషయాలను మనస్సులో పెట్టుకున్న బాలుడు ఎలాగైన యజమానికి నష్టం చేయాలనుకున్నా డు.

దీంతో ఆభరణాలను తయారు చేసే అజార్ రాత్రి ఇంటికి వెళ్లే సమయంలో ఆభరణాలను తీసుకెళ్తాడని, ఆ విషయాన్ని మీకు చెబితే దోపిడీ చేయాలని అనుకున్నారు. ఈ ఆపరేషన్‌కు నిజాముద్దీన్ నాయకత్వం వహించగా పాత నేరస్తులైన మహ్మద్ ఆసిఫ్, షేక్ ఖాలీద్, మహ్మద్ జావెద్ ఖాన్, మహ్మద్ అమ్జాద్‌తో పాటు సెక్యూరిటీగార్డుగా పనిచేసే మిశ్రిగంజికి చెందిన మహ్మద్ ముక్రామ్ అహ్మద్, వంట పనిచేసే మహ్మద్ సల్మాన్, సయ్యద్ జిలానీతో కలిసి మూడు బృందాలు తయారయ్యాయి. ఇందు లో భాగంగా ఈ నెల 17న అర్ధరాత్రి 12 గంటల సమయంలో దుకాణం మూసివేసి వెండి ఆభరణాలతో అజా ర్, దుకాణంలో పనిచేసే మరో బాలుడితో కలిసి బయలుదేరారు. ఈ సమాచారాన్ని మైనర్ బాలుడు గ్యాంగ్ లీడర్ నిజాముద్దీన్‌కు చెప్పాడు. వెంటనే అతను మూడు బృం దాలను అలర్ట్ చేశాడు. ఇందులో భాగంగా ఆసిఫ్, ఖాలీద్ బృందం ద్విచక్రవాహనంపై వెంబడిస్తూ జగన్నాథస్వామి ఆలయం సమీపంలోకి రాగానే అజార్ చేతిలో ఉన్న బ్యాగ్‌ను లాక్కొనే ప్రయత్నంలో దుండగులు కారంపొడిని వారి వాళ్ల కండ్లలో చల్లి, వాళ్లను కొట్టి వెండి ఆభరణాల బ్యాగ్‌ను లాక్కొని పరార య్యారు. తరువాత అందరూ వాటాలు పంచుకున్నారు.

బాధితుడి ఫిర్యాదుతో శాలిబండ పోలీసులు కేసు నమోదు చేసుకొని, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సహకారంతో దర్యాప్తు ప్రారంభించారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చైతన్యకుమార్ నేతృత్వంలోని టాస్క్‌ఫోర్స్ బృందం నగంరలోని వివిధ కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి అందులో లభ్యమైన ఆధారాలతో నిందితులు నిజాముద్దీన్ ముఠాగా గుర్తించారు. దీంతో ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్ చేసి, వారు దోపిడీ చేసిన 11 కిలోల వెండిని, దోపిడీకి ఉపయోగించిన మూడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...