నేపాల్ చుట్టొద్దామా..


Mon,April 22, 2019 12:33 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : వేసవిలో విహరించేందకు చాలా మంది పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంటారు. అటువంటి వారందరి కోసం నేచురల్ నేపాల్ పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరి జం కార్పోరేషన్(ఐఆర్‌సీటీసీ) సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. మే 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నేపాల్‌లేని ప్రముఖ పర్యాటక ప్రాం తాల సందర్శన ఉంటుంది. మే 20న ఉదయం 9.55 గంటలకు హైదరాబాద్ అంతర్జాతీయ విమానశ్రయం నుంచి ప్రారంభమై గోరఖ్‌పూర్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం గోరఖ్‌పూర్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమై హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఐఆర్‌సీటీసీ ప్యాకేజీలో భాగంగా ఒకొక్కరికీ రూ.35 వేలు చార్జి ఉంటుంది. అయితే ఈ ప్యాకేజీకీ సంబంధించి 25 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. ప్యాకేజీలో భాగంగా త్రీస్టార్ హోటల్ అకామిడేషన్ ఉంటుందని, ఏసీ ప్రయాణంతోపాటు టూర్‌గైడ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రయాణం ఇలా : విమానం ద్వారా గోరఖ్‌పూర్‌కు చేరుకుని లుంబినీకి చేరుకుని బస చేస్తారు. రెండోరోజు బుద్ధుడి జన్మ స్థలమైన వరల్డ్ పీస్ పగోడతోపాటు మాయాదేవి టెంపుల్ సందర్శన ఉంటుంది. పర్యటన ముగించుకుని పోఖరలో బస చేస్తారు.
మూడోరోజు పోఖరలో సైట్‌సీయింగ్‌లో భాగంగా ఫెవాలేఖ్, బింద్యాబాసిని మందిర్ దేవీ ఫాల్స్, గుప్తేశ్వర మహదేవ్ గుహలతోపాటు, సారంగ్‌కోట్ సన్‌రైజ్ పాయింట్, మనోకమ్మ టెంపుల్ సందర్శన ఉంటుంది.
నాలుగోరోజు ఉదయం ఖాట్మాంట్‌కు చేరుకుని సైట్ సీయింగ్ అనంతరం అక్కడ రాత్రి బసచేయడం జరుగుతుంది. తెల్లవారి ఉదయం నుంచి పశుపతినాథ్ టెంపుల్, దర్బార్ స్కేర్, రాయల్‌ప్యాలెస్, స్వయంభునాథ్ దేవాలయ దర్శనం చేసి అక్కడే బస చేస్తారు.
ఆరోరోజు ఉదయం చిట్వాన్‌కు బయలుదేరి చిట్వాన్ నేషనల్ పార్కుతోపాటు ఎలిఫెంట్ సఫారిని సందర్శించి అక్కడే రాత్రి బసచేసి ఉదయం లుంబినీకి బయలుదేరి లుంబినీలో రాత్రి బసచేస్తారు. మరుసటిరోజు లుంబినీ నుంచి గోరఖ్‌పూర్ చేరుకుని విమానం ద్వారా హైదరాబాద్‌కు వస్తారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...