సేవ్ వాటర్..!


Sun,April 21, 2019 12:58 AM

- నీటి సంరక్షణకు జల సైనికులు
- ఆరు జోన్లు.. ఆరు బృందాలు
- వార్డుకు వంద మంది
- 22న ఎన్టీఆర్ గార్డెన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : గ్రేటర్ వాసుల కోసం జలమండలి రోజూ సరఫరా చేస్తున్న 458.75 ఎంజీడీలలో 20 ఎంజీడీల మేర నీరు వృథా అవుతున్నది. నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన లేమితోనే వృథా అవుతుందని గుర్తించిన ఎండీ దానకిశోర్ సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జల నాయకత్వం-నీటి సంరక్షణ (వాక్) పేరిట 20వేల మంది వలంటీర్లతో జల సైన్యాన్ని రంగంలోకి దింపారు. 150 వార్డుల్లో వార్డుకు కనీసం వంద మంది వలంటీర్స్ చొప్పున ఆరు జోన్లలో ఆరు బృందాలను ఏర్పాటు చేశారు. జోనల్ కమిషనర్లు, జలమండలి డైరెక్టర్లు, స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యాసంస్థలతో కలిపి ఒక్కో బృందంగా ఏర్పాటు చేసి, నగర ప్రజల్లో నీటి పొదుపుపై అవగాహన పెంచనున్నామని ఎండీ దానకిశోర్ శనివారం తెలిపారు. ఈ బృందం ప్రతి వారానికి ఒకసారి సమావేశమై అవగాహన కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రూపొందిస్తారని చెప్పారు. నీటి పొదుపుపై వాక్ బృందం ప్రజలతో చర్చిస్తారని, నీటి వృథాను ఎలా అరికట్టాలి? వర్షాకాలంలో వరద నీరు భూమిలోకి వెళ్లేలా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలన్న దానిపై వివరిస్తామన్నారు. రోజూవారీ దినచర్యల్లో చేసే చిన్నపాటి మార్పులతో ప్రతి కుటుంబం రోజుకు 300 లీటర్ల నీటిని ఆదా చేయవచ్చని ఎండీ వివరించారు. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి నీటి పొదుపుపై అవగాహన కల్పించేందుకు పూర్తి స్థాయిలో 20వేల మంది వలంటీర్లు సన్నద్ధంగా ఉంటారని దానకిశోర్ స్పష్టం చేశారు.

రేపు ఎన్టీఆర్ గార్డెన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు
22న ఎర్త్ డేను పురస్కరించుకొని పెద్ద ఎత్తున నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా వలంటీర్లు, ఎన్జీవోల కార్యకర్తలు, కార్పొరేట్ కంపెనీల ఉద్యోగులతో ఎన్టీఆర్ గార్డెన్ వద్ద అవగాహన కల్పించనున్నామని ఎండీ చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ఫొటో ఎగ్జిబిషన్‌తో పాటు అవగాహనలో భాగస్వామ్యంలో అయ్యే ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకున్నామన్నారు. 22న జరిగే కార్యక్రమంలోపాల్గొనాలనుకునే వారు 9100108462, 79950 89083, 9989985102 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

ఆరు జోన్లు..ఆరు బృందాలు..
- చార్మినార్ జోన్- డాక్టర్ శివరాం (ఎన్‌ఐఆర్ ఇనిస్టిట్యూట్), మజార్ హుస్సేన్ (కోవా ఎన్జీవో), అజ్మీరా కృష్ణ (జలమండలి డైరెక్టర్ ఆపరేషన్స్-1), శ్రీనివాస్ రెడ్డి (బల్దియా జోనల్ కమిషనర్).

- కూకట్‌పల్లి జోన్ - ప్రొఫెసర్. గిరిధర్ (జేఎన్‌టీయూ), సుధాకర్ (వాటర్ ఎయిడ్ ఎన్జీవో), వీఎల్ ప్రవీణ్ కుమార్ (టెక్నికల్ డైరెక్టర్, జలమండలి), శంకరయ్య (జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్), బి. నిరంజన్ (కాలనీ సంక్షేమ సంఘం).

- ఖైరతాబాద్ జోన్- ప్రశాంత్ మహాపాత్ర (ఐహెచ్‌ఎస్), డాక్టర్ పండిత్ మడ్నూరే (స్టేట్ గ్రౌండ్ వాటర్ బోర్డు), సుభాష్ చంద్ర (కార్పెడ్ ఎన్జీవో), డాక్టర్ పీఎస్ సూర్యనారాయణ (సెకండరీ ట్రాన్స్‌మిషన్ డైరెక్టర్, జలమండలి), ముషారఫ్, ఐఏఎస్ (జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్).

- శేరిలింగంపల్లి జోన్- రామ్మోహన్‌రావు (ఆస్కి), హనుమంత చారి (ఎడబ్ల్యూడబ్ల్యూ) డాక్టర్ అల్తాఫ్ హుస్సేన్ (కామ్స్ ఎన్జీవో), పి. రవి (ఆపరేషన్స్-2 డైరెక్టర్ జలమండలి), దాసరి హరిచందన, ఐఏఎస్ (జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్), రామకృష్ణ (ఇన్ఫోసిస్ సంస్థ).

- సికింద్రాబాద్ జోన్- మురళీధర్ (ఆస్కీ), బసవరాజ్ (అస్సా ఎన్జీవో),విజయ్ కుమార్ రెడ్డి (రెవెన్యూ డైరెక్టర్, జలమండలి), రఘుప్రసాద్ (బల్దియా జోనల్ కమిషనర్), విజయ్ (ఇన్ఫోసిస్ సంస్థ).

- ఎల్బీనగర్ జోన్- ఉమా మహేశ్వర్ (సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు), మురళీరామ్ (ఫాన్సా ఎన్జీవో), శ్రీధర్‌బాబు (జలమండలి ప్రాజెక్టు డైరెక్టర్ -2), శ్రీనివాస్‌రెడ్డి (జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్)లు బృందంగా ఏర్పడ్డారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...