జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో...వేసవి వైద్య శిబిరాలు


Sat,April 20, 2019 12:58 AM

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : రోజురోజుకు పెరుగుతున్న ఎండ, వడగాలుల తీవ్రతతో పాటు అకాల వర్షాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభుత్వ ఆదేశాలు, కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా ముందస్తు వైద్య శిబిరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.ఈ వైద్య శిబిరాల్లో వడదెబ్బ తగలకుండా ప్రజలు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా వ్యాప్తంగా కాలనీలు, బస్తీల్లో ప్రజలకు వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. వడగాలు, తీవ్రమైన ఎండల కారణంగా వడదెబ్బ, డీ హైడ్రేషన్ నుంచి తక్షణ ఉపశమనం అందించడంతో పాటు వడదెబ్బ నుంచి రక్షించేందుకు ప్రజలకు సుమారు 2లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నారాయణరావు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే సుమారు 45-50వేల పైచిలుకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండగా, ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ముందస్తుగానే మేడ్చల్ జిల్లాకు 2లక్షల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను అందించిందని ఆయన తెలిపారు. ఈ ప్యాకెట్లను జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాల్లో, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ టీచర్ల వద్ద అందుబాటులో ఉంచామని తెలిపారు.

డీహైడ్రేషన్‌కు గురైన, వడదెబ్బ తగిలిన ప్రజలు ఆశావర్కర్లను సంప్రదించి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉచితంగా తీసుకోవడంతో పాటు మెడికల్ అధికారులను సంప్రదించి తగు చికిత్సను తీసుకోవాలని సూచించారు.మల్కాజిగిరి, అల్వాల్, దుండిగల్, బాలానగర్, వినాయకనగర్, ఏకలవ్యనగర్, పర్వతానగర్, శాపూర్‌నగర్, కుత్భుల్లాపూర్, కీసర, కుషాయిగూడ, ఉప్పల్, నారపల్లి, శామీర్‌పేట్, జవహర్‌నగర్, శ్రీరంగవరం, వెంకట్‌రెడ్డి నగర్, మల్లాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు డీఎంహెచ్‌వో స్టోర్‌లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు ఒక్కటి కూడా వడదెబ్బ కేసు నమోదు కాలేదని, అలాగే అకాల వర్షాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

124
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...