రవాణా..భలే ఖజానా


Thu,April 18, 2019 01:03 AM

- ట్యాక్స్‌లు, ఫీజులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ రూపంలో కాసుల పంట
- 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ. 2068. 41 కోట్ల్ల రాబడి


సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రవాణా శాఖకు గ్రేటర్‌లో కాసుల పంట పండింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ట్యాక్స్, ఫీజులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ రూపంలో రూ. 2068. 41 కోట్ల రాబడి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిసి రూ.3504.88 కోట్లు వస్తే.. కేవలం హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరడం విశేషం. రాష్ట్రంలో కోటికిపైగా వాహనాలుండగా, హైదరాబాద్‌లోనే అరకోటి వెహికిల్స్ రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రతిరోజూ 1,000 నుంచి 1500ల కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వాహనాల లైఫ్‌ట్యాక్స్, అపరాధ రుసుం, లైసెన్సులు, ఫ్యాన్సీ నంబర్ల వేలం తదితర వాటి ద్వారా భారీ స్థాయిలో ఖజానా నిండుతున్నది. -సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ

గ్రేటర్ రవాణాశాఖ ప్రభుత్వ ఖజానాకు కాసులు నింపుతున్నది. ట్యాక్స్‌లు, ఫీజులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ వల్ల 2018-19 ఆర్థిక సంవత్సరంలో రూ.2068.41 కోట్లు రాబడి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే రవాణాశాఖ ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం సముపార్జించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిసి రూ.3504.88 కోట్లు రాబడిరాగా అందులో సగానికి పైగా జంటనగరాల పరిధిలోనుంచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాష్ట్రంలో 33 జిల్లాలుండగా కేవలం నగరానికి సంబంధించిన మూడు జిల్లాల రవాణాశాఖ కార్యాలయాలే ఎక్కువ పన్నులు వసూలు చేశాయి. వాస్తవానికి రాష్ట్రంలో కోటికిపైగా వాహనాలుండగా హైదరాబాద్‌లో అరకోటి వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. ప్రతీరోజు 1,000 నుంచి 1500 కొత్త వాహనాలు రోడ్డెక్కుతుంటాయి.

ఇలా ప్రతీరోజూ రోడ్లపైకి వస్తున్న వాహనాల లైఫ్‌ట్యాక్స్‌తోపాటు ఎన్‌ఫోర్స్‌మెంటులో భాగంగా వేస్తున్న అపరాద రుసుంతోపాటు లైసెన్సులు, ఫ్యాన్సీనెంబర్ల వేలం, తత్కాల్ నెంబర్ల ద్వారా వచ్చే ఫీజుల వల్ల నగర రవాణాశాఖ ఆదాయం రెట్టింపవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టడం ద్వారా ఫీజులు, పన్ను చెల్లింపులు కూడా సులభతరంగా మారిపోవడంతో సెకండ్ వెహికల్ ట్యాక్స్ వంటి వసూళ్లలో కచ్చితత్వం ఏర్పడి పక్కా వసూళ్లవుతున్నాయి. ప్రజల వ్యక్తిగత ఆదాయం పెరుగుతుండటం వల్ల వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. చాలా మంది ద్విచక్ర వాహనాలు గల నగరవాసులు అప్‌డేట్ అవుతూ కార్లు కొనుగోలు చేస్తుండగా ఇప్పటికే కార్లున్నవాళ్లు ఉన్నతశ్రేణి వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. బైక్‌లు కూడా లక్షల విలువైనవి కొనుగోలు చేస్తుండటంతో భారీగా వాహనాల పన్ను వసూలు అవుతున్నది. రెగ్యులర్ ఆర్‌టీవోలు సరిపడినంత లేకున్నప్పటీకీ, ఎంవీఐలు నగరంలో తక్కువగా ఉన్నప్పటికీ రాబడి ఎక్కువ సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి.

సమిష్టి కృషి వల్ల భారీగా రాబడి: జేటీసీ నాయక్
రెండు వేల కోట్లకు పైగా రవాణాశాఖకు రాబడి రావడం వెనుక ఆర్‌టీ వోలు, ఎంవీఐ, ఏవోల స్థాయి నుంచి హోంగార్డు స్థాయి వరకు గల అధికారులు సిబ్బంది కృషి ఉందని హైదరాబాద్ జేటీసీ పాం డు రంగ నాయక్ తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చే లక్ష్యాన్ని చేరుకునేలా రవాణాశాఖ అధికారులందరమూ కృషి చేస్తామని అన్నారు.

2018-19 ఆర్ధిక సంవత్సరం రాబడి ఇలా
జిల్లా ఆదాయం రూ. కోట్లలో
హైదరాబాద్ 792.07
రంగారెడ్డి 687.97
మేడ్చల్ 588.27
మొత్తం 2068.41

117
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...