పండ్ల గోదాంలో అగ్ని ప్రమాదం


Thu,April 18, 2019 12:58 AM

బేగంబజార్ : పండ్ల గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో గోడౌన్‌కి చెందిన మూడు అంతస్థుల్లోని పండ్ల డెకరేటివ్ ఫర్నిచర్ కాలి బూడిదైంది. ఈ సంఘటన బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి , వ్యాపారుల కథనం ప్రకారం....

ఎంజే మార్కెట్ చౌరస్తా , మాలకుంటలో న్యూ లిబర్టీ ఫ్రూట్ డెకరేటివ్ గోడౌన్ ఉంది. నిర్వాహకుడు మక్సూద్‌ఖాన్(నయీం) ఈ గోడౌన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు పైన రెండు అంతస్థుల్లో ఫ్రూట్ డెకరేటివ్ నిర్వహిస్తున్నాడు. కాగా.. బుధవారం మధ్యాహ్నం 12.00గంటల సమయంలో గోడౌన్‌లోనుంచి పొగ వచ్చి మంటలు ఎగిసి పడ్డాయి. పక్కనున్న దుకాణ ఉద్యోగి గమనించి పోలీసులు, 101కు సమాచారం అందించాడు. పోలీసులు గోడౌన్ చుట్టు పక్కన ఉన్న దుకాణాలను మూసి వేయించారు. అగ్నిమాపక సిబ్బంది మొదట రెండు ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా.. మంటలు అదుపులోకి రాలేదు. దీంతో మొత్తం 5 ఫైరింజన్లు, రెండు వాటర్ ట్యాంకర్లతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ గోడౌన్‌లో వివాహాలు, ఫంక్షన్‌లలో ఫ్రూట్ డెకరేటివ్ డిసేప్లే చేసే 20 రకాల డెకరేటివ్ ఫర్నిచర్ పూర్తిగా కాలి బూడిదైందని యజమాని తెలిపారు.అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి, బేగంబజార్, నారాయణగూడ ఇన్‌స్పెక్టర్లు సుబ్బయ్య, రమేశ్‌కుమార్, అదనపు ఇన్‌స్పెక్టర్ జ్యోతి, ఎస్‌ఐలు సుధాకర్, నెహ్రూ, సంపత్, నరేందర్, గోపిలు తమ సిబ్బందితో భద్రత చర్యలు చేపట్టారు. అగ్నిమాపక హైదరాబాద్ జిల్లా ఫైర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు తంగెల్ల శ్రీనివాస్, సురేశ్, రాజ్‌కుమార్‌లు మంటలు అదుపులోకి వచ్చే వరకు సంఘటన స్ధలంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు.

54
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...