కోఠి ఈఎన్‌టీలో అరుదైన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స


Tue,April 16, 2019 11:56 PM

-7 నెలల బాలికకు శస్త్ర చికిత్స విజయవంతం ..
-ఈఎన్‌టీ వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు : బాలిక తండ్రి
బేగంబజార్: కోఠి ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖానలో అరుదైన కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్స నిర్వహించారు. వినికిడితో బాధపడుతున్న ఏడు నెలల బాలికకు శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.
నిజామాబాద్‌కు చెందిన దామోదర్ జవహర్ కూతురు అవిని జవహర్ (7 నెలలు) మెనిజెంటిస్‌తో బాధపడుతున్నది. రెండు చెవుల లోపలి భాగాల్లో కాక్లియర్ ఫైబ్రోసిస్ సోకడంతో వినికిడి లోపం అధికమైంది. దీంతో తల్లిదండ్రులు బాలికను కోఠి ఈఎస్‌టీ దవాఖానకు తీసుకువచ్చారు. అయితే రాష్ట్రంలో అరుదైన కాక్లియర్ శస్త్ర చికిత్స నిర్వహించే వైద్య నిపుణులు లేక పోవడంతో దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ చెన్నయ్‌కు చెందిన డాక్టర్ మోహన్ కామేశ్వర్‌ను ఇక్కడికి పిలిపించారు. ప్రముఖ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ నిపుణులు డాక్టర్ మోహన్ కామేశ్వర్ సమక్షంలో బాలికకు కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి బాలికకు వినికిడి శక్తిని ప్రసాదించిన వైద్యులకు బాలిక తండ్రి దామోదర్ జవహర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్ మనీష్, డాక్టర్ శోభన్‌బాబు, డాక్టర్ సత్యకిరణ్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ కరుణతో పాటు జూనియర్ వైద్యులు, అనస్థీషియా విభాగం వైద్యులు డాక్టర్ అక్రమ్ పాల్గొన్నారు.
ఇప్పటి వరకు 410 శస్త్ర చికిత్సలు : డాక్ట ర్ శంకర్
పుట్టుకతోనే వచ్చే చెవిటితనంను నిర్మూలించే కాక్ల్లియర్ ఇంప్లాంట్ సర్జరీని ప్రభుత్వ ఈఎన్‌టీ దవాఖానలో గత 11 ఏండ్లుగా చేపడుతున్నామని కోఠి ఈఎన్‌టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. ఇప్పటి వరకు 410 వరకు కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్ర చికిత్సలను పూర్తి చేశామన్నారు.

66
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...