యువత చెడు వ్యసనాలు వీడాలి


Mon,April 15, 2019 01:01 AM

-నార్త్ జోన్ డీసీపీ కళ్మేశ్వర్ సింగెన్‌వార్
రసూల్‌పురా : యువత చెడు మార్గాన్ని విడనాడి సన్మార్గంలో పయనించాలని నార్త్‌జోన్ డీసీపీ కళ్మేశ్వర్ సింగెన్‌వార్ కోరారు. ఆదివారం కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో పలువురు యువకులు చెడు వ్యసనాలకు బానిసవ్వడంతోపాటు న్యూసెన్స్‌కు పాల్పడుతుండడంతో స్థానిక సీఐ మధుకర్‌స్వామి, మహంకాళి ఏసీపీ వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. యువకులతోపాటు వారి తల్లిదండ్రుల సమక్షంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో డీసీపీ మాట్లాడుతూ యువత క్రమశిక్షణతో పని చేసి అందరికీ మార్గదర్శకంగా ఉండాలన్నారు. చెడు మార్గాలను విడనాడి మంచి మార్గంలో పయనించాలని సూచించారు. యువకులు దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు. క్షణికావేశంతో బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, యువతీయువకులు చెడు వ్యవసనాలకు లోనుకావద్దని సూచించారు. ప్రేమలు, గుట్కాలు, మద్యం, ఈవ్‌టీజింగ్, సెల్‌ఫోన్ చాటింగ్‌లతో కాలాన్ని వృథా చేసుకోవద్దన్నారు. మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో నిలిచి తల్లిదండ్రులు, గురువులకు గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. యుక్త వయసుకు వచ్చిన పిల్లలు అత్యధిక సంఖ్యలో ఇంటి నుంచి వెళ్లిపోయినట్లుగా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో ఇండ్లల్లోనే దీనికి విరుగుడును సాధించాలని ఆయన కోరారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...