సందడిగా సాగే.. ఉత్సాహం నింపే..


Sun,April 14, 2019 03:05 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఆటలు, పాటలు, కథలు, పాఠాలతో ఇంటిగ్రేటెడ్ ప్రీస్కూల్ టీచర్స్ ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన టీచర్ ట్రైనింగ్ ఫెస్టివల్ అలరించింది. ఆర్ట్ గ్యాలరీ అంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు, ఛాత్రోపాధ్యాయులు, ట్రైనింగ్ తీసుకునేందుకు వచ్చిన వారితో సందడిగా మారింది. ఐపీటీటీఏ - ఫెస్ట్ - 6 పేరుతో ఒకరోజు ప్రదర్శన శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్‌ఎన్‌డీటీ ఉమెన్స్ యూనివర్సిటీ, ముంబై మాజీ డీన్, దేశంలో ఎర్లీ చైల్డ్ ఎడ్యుకేషన్‌ను ప్రవేశపెట్టడంలో ప్రధాన భూమిక పోషించిన డాక్టర్ రీటా సోనావట్, సినీనటి నందిత హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ నిపుణురాలు సుల్తానా మొయిద్ గౌరవ అతిథిగా హాజరు కాగా, ఐపీటీటీఏ, డైరెక్టర్ సోనాల్ ఆండ్య్రూస్ ఈ ఫెస్టివల్‌లో పాల్గొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రీటా సోనావట్, సోనాల్ రవి ఆండ్య్రూస్‌ల సహ రచనలో భాగమైన ఆల్ ఎబౌట్ టీచింగ్ ఎయిడ్స్ పేరుతో ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. బోధన, ఆటలతో పిల్లలు సులభంగా నేర్చుకునే విధంగా తయారు చేసిన వినూత్న బోధన ఉపకరణాలు ఆకట్టుకున్నాయి. 500 మందికిపైగా స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రదర్శనను సందర్శించి పలువురిని అభినందించారు.

72
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...