టీఎస్ లాసెట్‌కు రేపే తుది గడువు


Sun,April 14, 2019 03:05 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : టీఎస్‌లాసెట్, పీజీఎల్‌సెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 15తో గడువు ముగియనుంది. న్యాయవిద్యలో భాగంగా మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు, ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలకు కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను మే20న నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోర్సులో అర్హత సాధిస్తే.. ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో చేరొచ్చు. ఇదిలావుంటే.. రూ.500 లేట్ ఫీజుతో ఈనెల 25 వరకు, రూ.వెయ్యి లేట్ ఫీజుతో మే 7 , రూ.2వేలతో మే12 , రూ.4వేలతో మే 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు జరిగితే మే 12 నుంచి 16 వరకు సరిచేసుకోవచ్చు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...