కారు జోరు.. కాంగ్రెస్ బేజారు..!


Fri,March 22, 2019 04:11 AM

-అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో గెలుపుతో గులాబీశ్రేణుల్లో నయా జోష్
-పట్లోళ్ల కుటుంబం పార్లమెంట్‌లో గెలుపు ఖాయం
-నియోజకవర్గంలో కాంగ్రెస్ అస్తవ్యస్తం
-టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా రంజిత్‌రెడ్డి

రంగారెడ్డి జిల్లా, నమస్తే తెలంగాణ : ఎన్నికలు ఏవైనా గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో దిగుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయడంతో శ్రేణుల్లో నయా జోష్ కన్పిస్తున్నది. జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని చేవెళ్ల లోక్‌సభ స్థానం టీఆర్‌ఎస్ ఉండగా, ఇటీవల ఎమ్మెల్యే ఎన్నికల ముందు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. 11న జరిగే ఎన్నికల్లో ఈ స్థానాన్ని మరోసారి దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. ఇప్పటికే చేవెళ్ల లోక్‌సభ ఇన్‌చార్జీగా పార్టీ రాష్ట్ర నాయకులు గట్టు రాంచందర్‌రావును నియమించి బాధ్యతలు అప్పగించారు. ఆయన పార్లమెంట్ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కార్యకర్తలు, నాయకులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఈ నెల 9న చేవెళ్లలో, మొన్న శంషాబాద్‌లో నిర్వహించిన రెండు సభలు విజయవంతం చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో 7 స్థానాలకు 5 స్థానాలు టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.

అయితే ఇందులో మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ల సబితారెడ్డి చేరాలని నిర్ణయించుకోగా, ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాత్రమే మిగిలారు. 7 అసెంబ్లీ స్థానాలకుగాను ఆరుగురు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే. పట్లోళ్ల కుటుంబం చేరికతో పార్లమెంట్‌తోపాటు జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపించనుంది. వీరితోపాటు అనేక మంది నాయకులు గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు.
కాగా, 2014 సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా.. పార్టీ చేవెళ్ల పార్లమెంట్ ఇన్‌చార్జీగా వ్యవహరించారు. 2018లో అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఆశించగా, భాగంగా టీడీపీకి కేటాయించారు. నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు.

లోక్‌సభ ఎన్నికల ముందు పట్లోళ్ల కుటుంబం కాంగ్రెస్ పార్టీని వీడింది. అయితే.. పట్లోళ్ల కుటుంబం, పట్నం కుటుంబం ఒకే పార్టీకి చేవెళ్ల పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైపోయింది. పట్లోళ్ల కుటుంబం కాంగ్రెస్‌ను ఆ పార్టీలో తీవ్ర నిస్తేజం అలుముకుంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాభవం చవిచూడడంతో ఆ పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డారు. తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కీలక నేతలు, ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఆ పార్టీలో కల్లోలానికి దారితీస్తోంది. వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌కు ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ప్రజ్రాప్రతినిధులు, కీలక నాయకులు వలసలు పోతుండడంతో ఆ పార్టీ అధినేతలకు ఏంచేయాలో పాలుపోని సరిస్థితి ఏర్పడింది.

ఆ పార్టీకున్న ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి మరికొద్ది రోజుల్లో టీఆర్‌ఎస్ కండువా కప్పుకోనున్నారు. ఇదిలాఉండగా, టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్‌రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. చేవెళ్ల పార్లమెంట్‌లో గెలుపు ఖాయంగా మెజార్టీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో వలసలు కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నాయి. నియోజకవర్గాలు, మండలాల వారీగా సమన్వయం నాయకత్వం లేకపోవడం, కార్యకర్తల్లో తీవ్ర నిస్తేజం అలుముకోవడంతో పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీకి భారంగా మారాయి. ఈ క్రమంలో చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తిరుగుతూ తనకు మద్దతివ్వాలని కోరుతున్నారు. సీనియర్ నేతల వద్దకు, ఇతర పార్టీల నేతల ఇండ్లకు వెళ్తున్నారు.

68
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...