మరోసారి ఆశీర్వదించండి..


Fri,March 22, 2019 04:08 AM

పెద్దఅంబర్‌పేట నాలుగున్నరేండ్లుగా తాను అభివృద్ధిని మరోసారి ఆశీర్వదించాలని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ కోరారు. మున్సిపాల్టీ పరిధిలోని పలు కాలనీల్లో సంఘాల సభ్యులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన అనంతరం జరిగిన అభివృద్ధి ఎంతో ఉన్నదన్నారు. నిరంతర విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గంలో అనేక పరిశ్రమలు ఉన్నాయని, మరెన్నో వస్తాయని తెలిపారు. రహదారులు నుంచి గౌరెల్లి మీదుగా భద్రాచలం వరకు మరో జాతీయ రహదారి వస్తుందని వివరించారు. ఎయిమ్స్ కోసం తాను చేసిన కష్టాన్ని ప్రజలు గుర్తిస్తున్నారన్నారు. విద్య, ఉపాధి, వైద్యం, సంక్షేమం వంటి కార్యక్రమాలపై కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, పరిశ్రమల తెలంగాణగా మారుస్తున్నారని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్‌ను ఒప్పించి దండుమల్కాపురంలో ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. అపాచీ హెలీకాప్టర్ పరికరాలు ఆదిబట్ల పరిధిలో తయారవుతున్నాయని, అదేవిధంగా అక్కడ అనేక పరిశ్రమలు, కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. నియోజరకవర్గ పరిధిలో ఫర్నీచర్ పరిశ్రమ వస్తున్నదని,తెలంగాణలో మొదటి డ్రైపోర్ట్ నకిరేకల్ నియోజకవర్గంలో వస్తున్నదని వివరించారు. రాచకొండ లిఫ్ట్‌తో 60 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, రానున్న రెండేండ్లలో పనులు పూర్తవుతాయని అన్నారు.

సంపద పెరిగిందని, భూమ్ పరుగెడుతున్నదని చెప్పారు. నియోజకవర్గం పరిధిలో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు వస్తున్నాయన్నారు. గత ఎంపీలు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఉన్నవారు తెలంగాణలో కేవలం 29 కిలోమీటర్ల జాతీయ రహదారి తీసుకొస్తే, తాను 524 కిలోమీటర్ల పొడవు తీసుకొచ్చానని తెలిపారు. తట్టిఅన్నారం పరిధిలోని 16వ వార్డులో గల ఇందు అరణ్య పల్లవి, విల్లాస్, తిరుమల కాలనీ, బ్రీజీవ్యాలీ కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులతో ఎంపీ మాట్లాడారు. అనంతరం కాలనీ సభ్యులు బూర నర్సయ్యగౌడ్‌ను సన్మానించారు. ఎంపీగా తిరిగి ఎన్నికైన తర్వాత తమ కాలనీల్లో అభివృద్ధి చేపట్టాలని కోరారు. టీఆర్‌ఎస్ నాయకులు అనంతుల వెంకటేశ్వరరెడ్డి, మున్సిపాల్టీ ప్రధాన కార్యదర్శి పాశం దామోదర్ జరిగిన ఈ సమావేశాల్లో ఆయా కాలనీల సంక్షేమ సంఘాల సభ్యులు, పార్టీ స్థానిక నాయకులు

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...