డాక్టర్ మర్రి కృష్ణారెడ్డికి వేదరత్న బిరుదు


Fri,March 22, 2019 04:08 AM

షాద్‌నగర్ : సంస్కృతంలోని నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి ముద్రించిన డాక్టర్ కృష్ణారెడ్డి వేదరత్న బిరుదును అందుకున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న 93వ శ్రీసనాతన వేదాంత జ్ఞానసభలో గురువారం చిత్తూరు జిల్లా ఏర్పేడులోని శ్రీవ్యాసాశ్రమ పీఠాథిపతి పరిపూర్ణానందగిరిస్వామి ఈ బిరుదును ప్రదానం చేశారు. చౌదరిగూడ మండలం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి చిన్నతనం నుంచే సంస్కృతంపై మక్కువను పెంచుకొని, డాక్టరేట్‌ను పొందారు. సంస్కృతంలోని నాలుగు వేదాలను తెలుగులోకి అనువదించి ముద్రణ చేయించారు. ఇటీవలే ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథంగా దివ్య వేదవాణి అనే గ్రంథాన్ని రచించారు. అదేవిధంగా 2017 సంవత్సరంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా వేదభాష్య పురస్కారం అందుకున్నారు. క్రమంలోనే వేదరత్న బిరుదును అందుకోవడం సంతోషంగా ఉన్నదని డాక్టర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

44
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...