జర భద్రం !


Thu,March 21, 2019 02:03 AM

- పండ్ల విక్రయదారులకు బల్దియా ఆదేశాలు

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఎండలు ముదరడంతో పండ్లు, పండ్ల రసాలకు గిరాకీ ఏర్పడింది. దీంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బల్దియా అధికారులు పండ్లు, పం డ్ల రసాల విక్రయదారులకు కొన్ని మార్గదర్శకాలను జారీచేశారు. ముఖ్యంగా పుచ్చకాయ లు, చెరుకుసరం, తదితర విక్రయాలు సాగించేవారు జాగ్రత్తలు పాటించాలని స్పష్టంచేశారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని హెచ్ఛరించారు. అలాగే, వినియోగదారులకు సైతం కొన్ని జాగ్రత్తలు సూచించారు.

పండ్ల విక్రయ, వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
-పుచ్చకాయతోపాటు ఇతర పండ్లను బహిరంగ ప్రదేశంలో కాకుండా సురక్షిత ప్రదేశంలో ఉంచాలి
- బాగా పండిన పండ్లను మాత్రమే ఉపయోగించాలి
- పండ్లను కార్బైడ్, ఇతర రసాయనాలతో కృత్రిమ పద్ధతుల్లో పండించరాదు. సహజసిద్ధంగా పండించాలి
- పుచ్చకాయను కోసేముందు కడగాలి
- తుప్పు లేకుండా ఉండే చాకుతోనే పండ్లను కోయాలి. చాకుతోపాటు పండ్లను ఉంచే పాత్రలను వేడినీటితో కడగాలి
- పండ్లను నిల్వచేయడానికి, వడ్డించేతప్పుడు ఐస్‌ను వాడకూడదు
- పండ్లను కోసేటప్పుడు, వడ్డించేటప్పుడు చేతికి గ్లౌస్‌లు ధరించాలి
- దుమ్మూ-ధూళి పడకుండా పండ్లను సరిగ్గా కప్పి ఉంచాలి
- వ్యర్థాలను బహిరంగ ప్రదేశాలు, రోడ్లు, నాలాలపై పడేయకుండా చెత్తకుండీలో వేయాలి

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...