పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి


Thu,March 21, 2019 02:02 AM

ఖైరతాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా నగరం, పట్టణం, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి మంచినీరు ఇచ్చే సంకల్పంతో ప్రత్యేక కృషి చేస్తున్నారని ప్రభుత్వ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ బి. జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి, రూరల్ డెవలప్‌మంట్ ఫోరం, సస్టయినబుల్ డెవలప్‌మెంట్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో వాటర్ అండ్ శానిటేషన్ మేనేజ్‌మెంట్ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ జనార్దన్ రెడ్డి మా ట్లాడుతూ ప్రతి ఇంటికి మంచినీరు, శానిటేషన్ ఎంత అవసరమో పరిశుభ్రత (హైజిన్) కూడా అంతే అవసరమన్నారు. విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి పాఠశాలలో శానిటేషన్, హైజిన్‌పై దృష్టి సారించానని తెలిపారు. రాష్ట్రంలో 28వేల విద్యాసంస్థలు ఉండగా, 60 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు. అయితే మంచినీరు సమృద్ధిగా అందిస్తున్నామని, ప్రతి విద్యార్థి ఆహార తీసుకునే ముందు, బహిర్భూమికి వెళ్లి వచ్చిన క్రమంలో హైజిన్ పాటించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చొరవ చూపాలన్నారు. హైజిన్ విషయంలో మరింత విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నీరు, శానిటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, ప్రజలకు నాణ్యమైన పరిశుభ్రమైన నీటిని అందించేందుకు ఇంజనీర్లు టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయాలన్నారు. ప్రతి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సదస్సు అనంతరం నీరు, శానిటేషన్ అంశాలపై 25 పత్రాలను సమర్పించారు. ఈ సదస్సులో ఇంటర్మీడియేట్ బోర్డు కార్యదర్శి డాక్టర్ అశోక్, ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ చైర్మన్ డాక్టర్ జి. రామేశ్వర్ రావు, కార్యదర్శి టి. అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...