యువత స్వయం ఉపాధివైపు అడుగులు వేయాలి


Wed,March 20, 2019 12:19 AM

కాప్రా, మార్చి 19 : దళిత, గిరిజన యువతీ యువకులు స్వయం ఉపాధివైపు అడుగులు వేయాలని బుద్ధవనం ప్రాజెక్టు అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ఏఎస్‌రావునగర్‌లోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌ఐసీ)లో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు దళిత బహుజన రిసోర్స్‌సెంటర్ (డీబీఆర్‌సీ), ఎన్‌ఎస్‌ఐసీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన రెండురోజుల శిక్షణా కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ శిక్షణా కార్యక్రమానికి జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య, ఎన్‌ఎస్‌ఐసీ అధికారులు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మల్లెపల్లి మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారకపోతే భవిష్యత్తు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మనుషులు పనిచేసేవారు, ప్రస్తుతం మనుషుల స్థానంలో యంత్రాలు పనిచేస్తున్నాయన్నారు. ఎన్‌ఎస్‌ఐసీ డిప్యూటీజనరల్ మేనేజర్ భోగా విష్ణుమూర్తి మాట్లాడుతూ ప్రజలకు అవసరమయ్యే సబ్బులు, విస్తరాకుల తయారీతో పాటు కారంపొడి, పిండిగిర్ని పెట్టుకొని సొంత గ్రామంలో స్వయం ఉపాధి పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు, డీబీఆర్‌సీ రాష్ట్ర సమన్వయకర్త పెద్దలింగన్నగారి శంకర్, రిసోర్స్‌పర్సన్ డాక్టర్ మనోహర్, ఎన్‌ఎస్‌ఐసీ అసిస్టెంట్ మేనేజర్ టి.ముత్తు పాల్గొన్నారు.

39
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...