ఒకే వేదికపై 207 మందికి సీమంతం


Wed,March 20, 2019 12:18 AM

జవహర్‌నగర్ : మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దేశంలో ఎక్కడ లేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని జవహర్‌నగర్‌లో అమ్మ ఫౌండేషన్, అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం 207 మంది గర్భిణులకు సమూహిక సీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి దంపతులు, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, రాష్ట్ర ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు బి.చంద్రశేఖర్‌యాదవ్‌లు హాజరై గర్భిణులకు సీమంతం నిర్వహించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన పెండ్లి రోజున గర్భిణులకు సీమంతాలు నిర్వహించి వారిని ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర మంత్రిగా మొదటి సారి జవహర్‌నగర్‌కు విచ్చేసిన మల్లారెడ్డికి గులాబీశ్రేణులు ఘన స్వాగతం పలికారు.

మంత్రి పెండ్లిరోజు సందర్భంగా మేకల అయ్యప్ప మంత్రి దంపతులచే కేక్‌ను కట్ చేయించిన అనంతరం టీఆర్‌ఎస్ నాయకుడు పూడూరు చందర్ పట్టు వస్త్రాలు అందజేశారు. అమ్మ ఫౌండేషన్ చైర్మన్ అనీల్‌కుమార్, అయ్యప్ప సేవా సమితి చైర్మన్, మేడ్చల్ జిల్లా టీఆర్‌ఎస్ నాయకుడు మేకల అయ్యప్ప, లక్ష్మి, మేకల భర్గవరామ్, హారిక, ప్రవీణ్, కావ్య దంపతులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు మురిగేశ్, జాగృతి నాయకురాలు మేక లలితాయాదవ్, గ్రామ సర్పంచ్ గడ్డమీది మల్లేశ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్‌గౌడ్, సతీశ్‌కుమార్, మహిళా అధ్యక్షురాలు అబ్బగోని పుష్ప, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నోజు సుధాకర్‌చారి, కోశాధికారి సింగన్న బాల్‌రాజ్ పటేల్, ఉపాధ్యక్షుడు జిట్టా శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములు, సహాయ కార్యదర్శులు సత్యనారాయణ యాదవ్, ఎస్టీసెల్ అధ్యక్షుడు కోనేరు భాస్కర్, ఎంపీటీసీలు పరశురాం, బొబ్బిలి మంజుల, శ్యామల, మహేశ్వరీ, రషీదాబేగం, బోరెడ్డి రాధ తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...