ఎరుకల అభివృద్ధికి కృషి


Wed,March 20, 2019 12:15 AM

బషీర్‌బాగ్, మార్చి 19: ఎరుకల అభివృద్ధికి, పందుల పెంపకానికి ప్రత్యేక ఫెడరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం 63 వార్షికోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా 35 మందికి ఏకలవ్య అవార్డులను అందజేశారు. అనతరం ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ... తాను చైర్మన్‌గా నియామకమైనప్పటి నుంచి 27,033 పెండింగ్ కేసులున్నాయని వాటిలో 26 వేల కేసులను పరిష్కరించామని, ఇంకా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరలో పరిష్కరించనున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడలేని విధంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ పారదర్శకంగా , అణగారిన వర్గాల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు కృషి చేస్తున్నదని తెలిపారు. జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలంలోని నక్కలోనిగూడెంతో పాటు పలు గ్రామాల్లో చెంచుల కుటుంబాలను సందర్శించి వారి స్థితిగతులపై అధ్యయనం చేసి నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. ఐటీడీఏల పరిధిలో ఎస్సీ ఎస్టీలు, లంబాడీలు, గోండులు, చెంచుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని వివరించారు.

ఎక్కడైనా సమస్య కనబడితే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, దాదాపు 85 శాతం సమస్యలను పరిష్కరించామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగాలని, ఎస్సీ ఎస్టీల వర్గాల అభివృద్ధికి కుల సంఘాలు కృషి చేయాలన్నారు. ధైర్యాన్ని కోల్పోతే కన్నీటి చుక్కలు కార్చ కూడదని, చెమటచుక్కలు చిందించినప్పుడే విజయం తథ్యమని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కూతాటి కుమార్, లోకిని రాజులు మాట్లాడుతూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న ఎరుకల కులస్తుల అభివృద్ధికి రాజకీయ రిజర్వేషన్లు కల్పించి చట్టబద్ధత కల్పించాలన్నారు. రాజకీయ రిజర్వేషన్ల ద్వారానే తమ కులస్తులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.తెలంగాణలో దాదాపు 5 లక్షల మంది ఎరుకల కులస్తులున్నారని, వారికి విద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమ పథకాలను కల్పించాలన్నారు. ఈ సందర్భంగా సంఘం కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను శాలువాతో సన్మానించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు సుంకపాక దేవయ్య, సంఘం ముఖ్య సలహాదారు పీవీ. రమణ, రాష్ట్ర నాయకులు రమేశ్, సత్యనారాయణ, నర్సింహ, బి.రఘు, వెంకటేశ్వర్లు, పాలకుర్తి మల్లేశ్, సత్యనారాయణ, కిమ్మరం తిరుపతి, మల్లేశం, పల్లకొండ శ్రీనివాస్, రవి, కేతిరి సీతారాములు, లాలుకోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...