అక్రమ నల్లా కనెక్షన్ తీసుకొన్న ముగ్గురిపై కేసు నమోదు


Wed,March 20, 2019 12:14 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : జలమండలి సరఫరా చేస్తున్న పైపులైన్ నుంచి అక్రమంగా నల్లా కనెక్షన్లు పొందిన భవన యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు జలమండలి అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చింతల్ గణేశ్‌నగర్‌లోని ఇంటి నంబరు 48-450/2/ఎ భవనానికి అధికారుల అనుమతి లేకుండా భవన యజమాని అక్రమంగా నల్లా కనెక్షన్ తీసుకున్నారని గుర్తించి ఎండీ దానకిశోర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు. సంబంధిత భవన యాజమాని కోరపు నర్సయ్యపై జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో యు/ఎస్ 269, 430, 379 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. జలమండలి అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా నల్లాకనెక్షన్లు తీసుకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు ఈ సందర్భంగా హెచ్చరించారు.
అమీర్‌పేట్ నమస్తే తెలంగాణ : అక్రమంగా మంచి నీటి నల్లా కనెక్షన్ తీసుకున్న ఇద్దరిపై జలమండలి అధికారులు చేసిన ఫిర్యాదు మేరకు సనత్‌నగర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. సనత్‌నగర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

జలమండలి ఫతేనగర్ సెక్షన్ పరిధిలోని సనత్‌నగర్‌లోని ఎస్‌ఆర్టీ 39, టీఆర్టీ 1209 క్వార్టర్ల యజమానులు అక్రమంగా తమ ఇంటికి నల్లా కనెక్షన్ తీసుకున్నారు.
అయితే అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు జలమండలి విజిలెన్స్ విభాగం అధికారులు దాడులు నిర్వహించి.. అక్రమ కనెక్షన్‌ను తొలిగించారు. అనంతరం విజిలెన్స్ అధికారులు జరిగిన అవినీతిపై సనత్‌నగర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సనత్‌నగర్ పోలీసులు అక్రమంగా నల్లా కనెక్షన్‌ను తీసుకోవడం, ఈ చర్య ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం కల్పించడం, మంచినీటి చౌర్యం, నేరాలను పరిగణనలోకి తీసుకొని ఐపీసీ సెక్షన్ 430, 269, 379 సెక్షన్ల కింద సనత్‌నగర్ ఎస్‌ఆర్టీ 39కు చెందిన ఫరూఖ్, టీఆర్టీ 1209కు చెందిన సత్యనారాయణలపై కేసులు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...