ఓటరు చైతన్యానికి కమ్యూనిటీ రేడియోలు


Sat,February 23, 2019 12:08 AM

-హెచ్‌సీయూలో ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ మూడురోజుల జాతీయ సదస్సు
-స్వీప్ డైరెక్టర్ పద్మ
కొండాపూర్, ఫిబ్రవరి 22 : ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు వినూత్నంగా కమ్యూనిటీ రేడియోల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టీసిపేషన్ (స్వీప్) డైరెక్టర్ పద్మ అన్నారు. శుక్రవారం గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఆడిటోరియంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా- యూనెస్కో-హెచ్‌సీయూలు సంయుక్తంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ కమ్యూనిటీ రేడియోల ద్వారా ఓటరు అవగాహన జాతీయ వర్క్‌షాపునకు తెలంగాణ జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవి కిరణ్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ గత 10 సంత్సరాల నుంచి ఓటర్లను చైతన్యం పరిచేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు.

ఓటర్లను చైతన్య పరిచి, ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునేలా చేసేందుకు కమ్యూనిటీ రేడియోలో కీలక పాత్ర వహిస్తాయన్నారు. పట్టణ, గ్రామీణ, మారుమూల గ్రామాలతో పాటు అటవీ ప్రాంత ప్రజలకు సైతం రేడియోలు చేరువవుతాయన్నారు. హెచ్‌సీయూలో ఎలక్షన్‌క్లబ్‌ను ఏర్పాటు చేసేందుకు వర్సిటీ వీసీ అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవి కిరణ్ మాట్లాడుతూ ఓటర్లను చైతన్య పరిచే ప్రక్రియలో భాగంగా కమ్యూనిటీ రేడియో విధానం వినూత్నంగా ఉందన్నారు. కమ్యూనిటీ రేడియో ఓటరు అవగాహనలో 25 రేడియోస్టేషన్లు పాలు పంచుకోనున్నట్లు యూనెస్కో హెచ్‌సీయూ చైర్మన్ ప్రొఫెసర్ వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్‌సీయూ వీసీ అప్పారావు, కమ్యూనిటీ రేడియో ప్రెసిడెంట్ అన్సారీ, ఫ్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...