మధ్వ మహా సమ్మేళన స్వర్ణోత్సవాలు ప్రారంభం


Sat,February 23, 2019 12:05 AM

కాచిగూడ: పవిత్ర గంగానది ప్రక్షాళన పూర్తి స్థాయిలో జరగాలని, గంగానదిని అపవిత్రం చేస్తున్నారని, దీనిని పూర్తిగా నిరోధించాలని ఉడుపి శ్రీ పెజావర మఠం పీఠాధిపతి విశ్వేశ్వతీర్థ స్వామీజీ కోరారు. శ్రీ పెజావర మఠం, ఉడుపి, అఖిల భారత మధ్వ మహా మండలి సంయుక్త ఆధ్వర్యంలో అఖిల భారత మధ్వ మహామండలి ఏర్పడి 50 ఏండ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం బర్కత్‌పురాలోని నృపతుంగ కళాశాలలో 3 రోజుల పాటు జరిగే అఖిల భారత మధ్వ మహా సమ్మేళన స్వర్ణోత్సవాలు మొదటి రోజు అట్ట హసంగా ప్రారంభమయ్యాయి. ఈ అఖిల భారత మధ్వ మహా సమ్మేళన కార్యక్రమాన్ని విశ్వేశ్వతీర్థ స్వామీజీ, పీఠాధిపతులు జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ప్రముఖ సైంటిస్ట్ పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత పల్లె రామారావు అధ్యక్షత వహించారు. ఈ మహా సమ్మేళన స్వర్ణోత్సవాల వేడుకల సందర్భంగా రాఘవేంద్రస్వామి దేవాలయం నుంచి నృపతుంగ కళాశాల వరకు వందలాది మంది భక్తులతో ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంటేశ్, కాచిగూడ కార్పొరేటర్ ఎక్కాల చైతన్యకన్నా, పీఠాధిపతులు విశ్వ ప్రియతీర్థ స్వామిజీ, సత్యాత్మ స్వామిజీ, విశ్వప్రసన్న తీర్థర్‌స్వామిజీ, విద్యవల్లభాతీర్థ స్వామిజీ, విశ్వాధిపతి స్వామిజీ, విఠల్‌జోషి, కె.నరసింహచారి, కన్నడ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...