బీమాతో అన్నదాతకు ధీమా


Thu,February 21, 2019 02:50 AM

-రైతుల కుటుంబాలకు సర్కార్ అండ
-జిల్లాలో 1,32,296మంది రైతులకు బాండ్లు పంపిణీ
-ఇప్పటివరకు మృతిచెందిన రైతులు 355 మంది
-350 మంది వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు
-327 మందికి రూ.5లక్షల చొప్పున సాయం అందజేత
-సర్కారుకు రుణపడి ఉంటామంటున్న రైతు కుటుంబాలు
రైతుల సంక్షేమానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. అన్నదాతలు అప్పులు చేసి ఇబ్బందులు పడవద్దని.. రైతు బంధు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న సర్కార్.. ప్రమాదవశాత్తు రైతు మృతిచెందితే ఆ కుటుంబం వీధిన పడకుండా రూ.5లక్షల ప్రమాదబీమా సదుపాయాన్ని కల్పించింది. 18-59 ఏండ్ల వయస్సు కలిగిన రైతులకు ఒక్క రూపాయి చెల్లించకుండా ప్రీమియం రూ.2,270 ప్రభుత్వమే భరించి రైతులకు ప్రమాదబీమా బాండ్లు పంపిణీ చేసింది. గతేడాది ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 355 మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందగా అందులో ఇప్పటివరకు 327 మంది రైతు కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున ప్రభుత్వం సాయం అందజేసింది. జిల్లాలో 1,32,296 మంది రైతులకు బాండ్లు పంపిణీ చేశారు.

షాబాద్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని 27 మండలాల్లో మొ త్తం 1.32.296మంది రైతులున్నారు. ఇందులో ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. వీరందరికీ ప్రస్తు తం బీమా సౌకర్యం వర్తించనుంది. ప్రభుత్వం నూతనంగా జారీచేసిన పట్టదారు పాస్‌పుస్తకాల ఆధారంగా రైతులందరికీ బీమా వర్తిస్తుంది. రైతు బీమా పథకంలో ఒక్కో రైతుకు ఏడాదికి రూ.2.270ప్రీమియం చెల్లించాల్సి ఉండగా ఈ మొత్తాన్ని ప్రభుత్వమే భరించింది. 18ఏండ్లు నిండిన ప్రతి రైతుకు బీ మా అవకాశం లభించనుంది. ఇన్సూరెన్స్ నిబంధనల మేరకే 60 ఏండ్లలోపు రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. రైతు బీ మా దరఖాస్తు ఫారంలో నామినీగా పెట్టిన వ్యక్తికి బీమా మొత్తం డబ్బులు అందజేస్తారు.

327మంది రైతు కుటుంబాలకు సాయం అందజేత...
జిల్లావ్యాప్తంగా గతేడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు మొత్తం 355మంది రైతులు వివిధ కారణాలతో మృతిచెందారు. అం దులో 350మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం జరిగింది. ఎల్‌ఐసీ, డాక్యుమెంట్ ప్రాసెస్‌లో మరో 26మంది రైతుల ైక్లెమ్స్ ఉండగా, 327మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున మొత్తం రూ.17.50కోట్లు ప్రభు త్వం అందజేసింది. రైతు జీవిత బీమా పథకంతో జిల్లాలో లక్షలాదిమంది రైతులు బీమా పరిధిలోకి వచ్చారు. రైతు ఏ కార ణం చేతనైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5లక్షల బీమా వర్తించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. వ్యవసాయం చేసే రైతు ఎలాంటి ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా పెట్టుబడి సాయం అందించడంతోపాటు ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధినపడవద్దని రూ.5లక్షల ప్రమాద బీమా సదుపాయం కల్పించడంతో అన్నదాతలకు వ్యవసాయంపై మరింత నమ్మకం పెరిగింది. రైతు కుటుంబాలను ఆదుకుంటూ అండగా నిలుస్తున్న సర్కార్‌కు రుణపడి ఉంటామని రైతు కుటుంబాలు చెబుతున్నాయి.

వ్యవసాయం దండుగ కాదు..పండుగ
వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్న ప్రభు త్వం రైతులకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. రైతుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు వారు అడగకముందే అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని పథకాలను అందిస్తూ వారికి అనేక రకాల మేలు కల్పిస్తున్నారు. గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకంపై గ్రామీణ ప్రాంతాల్లో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటివరకు చాలామంది రైతులకు బీమా సౌకర్యమే లేదు. బీమా పథకాన్ని సీఎం కేసీఆర్ నేరుగా రైతులకు ఉచితంగా కల్పించడం మూలంగా వారి కుటుంబాల్లో ధీమా నింపుతుంది.

మాకు రూ. 5లక్షలు ఇచ్చిండ్రు
మా బావ రెడ్యానాయక్ నెల రోజుల క్రితం చనిపోయాడు. ఆయన పేరు మీద ఎకరంనర భూమి ఉంది. నామినీగా ఉన్న మా అక్కకు ప్రభుత్వం నుంచి రైతుబంధు పథ కం ద్వారా రూ. 5లక్షలు ఇచ్చిండ్రు. పేద కుటుంబానికి సర్కారు సాయం చేయడంతో మాకు భరోసా కలిగింది. కేసీఆర్ సార్‌ను ఎప్పటికీ మరిచిపోం. మా కుటుంబం ముఖ్యమంత్రికి రుణపడి ఉంటుంది.
- గోపాల్, పోతుగల్‌తండా, షాబాద్

సర్కార్ సాయం ఎప్పటికీ మరిచిపోం
రైతు బంధు పథకం ద్వారా సర్కార్ మాకు చేసిన సాయాన్ని ఎప్పటికీ మరిచిపోం. ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రమాదవశాత్తు ఇటీవల నా భర్త మృతిచెందాడు. పది రోజుల్లోనే ప్రభుత్వం నుంచి మా కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం మేలు ఎప్పటికీ మరిచిపోం. కేసీఆర్ సార్‌కు రుణపడి ఉంటాం.
- శ్యామలమ్మ, ఫత్తేపురం, శంకర్‌పల్లి

జిల్లాలో 327మందికి ైక్లెమ్స్ అందించాం
జిల్లావ్యాప్తంగా 355మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. ఇప్పటివరకు 350మంది రైతుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. 327మంది రైతులకుగానూ రూ.17.50కోట్లు డబ్బులు అందించాం. మరో 26మంది రైతుల ైక్లెమ్ వివరాలు ఎల్‌ఐసీ, డాక్యుమెంట్ ప్రాసెస్‌లో ఉన్నాయి. వారికి కూడా త్వరలో బీమా డబ్బు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి

65
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...