60 ఏండ్లుగా.. పాలమ్ముతున్నారు


Tue,February 19, 2019 12:22 AM

-గ్లాసు మిల్క్, బ్రెడ్‌తో ఆకలి తీరుస్తున్నారు
-రోజూ వంద లీటర్ల వరకు విక్రయం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : పాలు తాగేది.. ఏదో ఉదయం అనుకుంటే.. పొరపాటు. ఉదయం 11 గంటలు మొదలు.. రాత్రి 9 వరకు అక్కడ వందల లీటర్ల పాలు విక్రయిస్తుంటారు. ఏండ్ల తరబడి రూ.10కి గ్లాసు పాలు.. మరో రూ.5కు బ్రెడ్.. ఇది చాలు మధ్యాహ్నం పూట వేల మందికి ఆకలి తీర్చే ఆదరువు.
తండ్రి నుంచి వారసత్వంగా..
నగరానికి చెందిన రామకృష్ణ, దాస్, శివ ముగ్గురు అన్నదమ్ములు. వీరు తమ తండ్రి బి.సత్యనారాయణ నుంచి వారసత్వంగా వచ్చిన మిల్క్ హౌజ్‌ను ఏండ్ల తరబడిగా నడిపిస్తున్నారు. చిన్నగ్లాసు రూ.10, పెద్దగ్లాసు రూ.20కి అందిస్తున్నారు. సత్యనారాయణ నుంచి ఇప్పటివరకు దాదాపు 60 ఏండ్లుగా కేవలం పాలను విక్రయించడంపైనే ఆధారపడుతున్నారు. ఈ వ్యాపారంపై మూడు కుటుంబాలు ఆధారపడడంతో పాటు మరో ముగ్గురికి ఉపాధిని కల్పిస్తున్నారు. నగరశివారులోని పోచంపల్లి, శంకర్‌పల్లి ప్రాంతాల్లో గేదేల నుంచి సేకరించిన పాలను నేరుగా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...