మరింత వేగంగా నిర్మాణ రంగ అనుమతులు


Tue,February 19, 2019 12:17 AM

సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ పరిధిలో నిర్మాణ రంగ అనుమతుల జారీ ప్రక్రియ మరింత వేగవంతం కానున్నది. పౌరులకు సత్వర సేవలే లక్ష్యంగా డెవలప్‌మెంట్ పర్మిషన్ మేనేజ్‌మెంట్ సిస్టం (డీపీఎంఎస్) ద్వారా అవినీతి రహిత పర్మిషన్లను ప్లానింగ్ విభాగం అధికారులు మంజూరు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సంబంధిత నిర్మాణ దరఖాస్తు మొదలు ధ్రువీకరణ పత్రం అనుమతుల జారీ వరకు సింగిల్ విండో విధానానికి శ్రీకారం చుట్టారు. దరఖాస్తుదారులకు ఈ విధానంతో మరింత ఉపశమనం లభించనున్నది. దరఖాస్తుల పరిశీలన క్రమంలో ఎలాంటి షార్ట్‌ఫాల్ ఉన్నా.. ఆయా దరఖాస్తుదారులు ఇతర శాఖల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన అక్కర్లేకుండా ఆన్‌లైన్ ద్వారానే హెచ్‌ఎండీఏ అధికారులు సమాచారాన్ని సేకరించి నిర్ణీత వ్యవధిలో అనుమతులు ఇవ్వనున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఫైర్ డిపార్ట్‌మెంట్, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఎన్వీరాల్‌మెంట్ ఇంఫాక్ట్ ఫీజు అసెస్‌మెంట్ అథారిటీ, హెరిటేజ్ తదితర శాఖలను సమన్వయం చేస్తూ.. సింగిల్ విండో విధానానికి హెచ్‌ఎండీఏ రూపకల్పన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

నెలకు రూ. 50 కోట్లకు పైగా..
బిల్డింగ్ , సీఎల్‌యూ (ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్), లే అవుట్ (డ్రాఫ్ట్/ఫైనల్), ఎన్‌వోసీ, అక్యూపెన్సీ సర్టిఫికెట్, ల్యాండ్ యూజ్ సర్టిఫికెట్, పెట్రోల్ బంకు ఎన్‌వోసీ, టీఎస్ ఐపాస్ (బిల్డింగ్ పర్మిషన్)ల అనుమతులను డీపీఎంఎస్ విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నారు. నెలకు వందల సంఖ్యలో అనుమతుల ద్వారా దాదాపు రూ.50 కోట్లకు పైగా హెచ్‌ఎండీఏ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నది. దరఖాస్తుల పరిశీలనలో ఓపెన్ స్పేస్, రిక్రియేషనల్ వాటర్ బాడీ, సెంట్రల్ స్కేర్, ట్రాన్స్‌పోర్టేషన్, బయో కన్జర్వేషన్, ఫారెస్ట్ జోన్, మాస్టర్‌ప్లాన్ రోడ్డు, ఓపెన్ స్పేస్ జోన్, ఆఫ్ లే అవుట్, నాలా బఫర్ జోన్‌లోని ప్లాట్లు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంబంధిత నిర్మాణ రంగ అనుమతుల జారీలో అత్యధికంగా రెవెన్యూ స్కెచ్, ఇరిగేషన్ ఎన్‌వోసీ, ఫైర్ ఎన్‌వోసీ, ఎయిర్‌పోర్టు అథారిటీ, ఎన్వీరాల్‌మెంట్ ఎన్‌వోసీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇరిగేషన్ ఎన్‌వోసీ కోసం ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయగా , ప్రతి పది రోజులకొకసారి కమిటీ సమావేశమై దరఖాస్తుదారులతో సంబంధం లేకుండా ఆయా శాఖల సమన్వయంతో ఎన్‌వోసీలను తెప్పించుకొని అనుమతులు మంజూరు చేస్తున్నది.షార్ట్‌ఫాల్‌ను ఆయా శాఖలతో నివృత్తి చేసుకొని అన్ని అనుమతులు ఉన్నా దరఖాస్తులకు త్వరితగతిన పరిష్కారం చూపాలన్న లక్ష్యంలో భాగంగా సింగిల్‌విండో విధానానికి శ్రీకారం చుట్టారు.

74
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...