మరోసారి తలసానిని వరించిన మంత్రి పదవి


Tue,February 19, 2019 12:16 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : తనదైన శైలిలో దూసుకుపోయే సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముచ్చటగా నాలుగోసారి మంత్రిపదవి చేపట్టనున్నారు. ఈ మేరకు సీఎం కేసీ మంత్రి వర్గంలో ఆయనకు సముచిత స్థానం కల్పించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రెండోసారి మంత్రి పదవి దక్కించుకుని ఇక గ్రేటర్ రాజకీయాల్లో తలసాని తనదైన ముద్ర వేసుకున్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, మూడు పర్యాయాలు మంత్రిగా పనిచేయడంతో పాటు మరెన్నో పదవులను పొంది నగర మాస్‌లీడర్‌గా ముద్రగావించారు. ఈ నేపథ్యంలోనే తలసాని రాజకీయ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మరోసారి మంత్రిగా అవకాశం కల్పిస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేసీఆర్ మంత్రి వర్గంలో గ్రేటర్ నుంచి హోంమంత్రిగా మహమూద్ అలీ ఉండగా తాజా మంత్రి వర్గ విస్తరణతో తలసానికి చోటు లభించడంతో మంత్రుల సంఖ్య రెండుకు చేరింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు మంత్రిగా ప్రమాణా స్వీకారం చేయనున్నారు. గతంలో మంత్రిగా పనిచేసిన పద్మారావు, నాయి ని నర్సింహారెడ్డితో పాటు మంత్రి పదవి ఆశించిన ఎమ్మెల్యేలకు అవకాశం దక్కలేదు. అటువంటి నేతలకు డిప్యూటీ స్పీకర్, పార్లమెంట్ సెక్రెటరీ నియామకాల్లో గ్రేటర్‌కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.

ముచ్చటగా నాలుగో సారి..
అటు రాజకీయాల్లో ఇటు ప్రభుత్వ పాలనలో తలసాని తనదైన ముద్ర వేసుకున్నారు. ఏ పదవికైనా వన్నె తెస్తూ రాజకీయాల్లో ఆదర్శనేతగా నిలిచారు. కేసీఆర్ ఇచ్చిన బాధ్యతల్ని వమ్ము చేయకుండా అటు నగర టీఆర్‌ఎస్ బలోపేతం పాటు ఇటు అభివృద్ధిలో కీలకపాత్ర చేశారు. మత్స్య, పశు సంవర్థక శాఖ, సినీమాటోగ్రఫీ శాఖ మంత్రిగా తలసాని తనదైన శైలిలో పాలన అందించారు. అంతకుముందు జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కేటీఆర్‌తో పాటు తలసాని కూడా తమ వంతు బాధ్యతను పోషించారు. ఏ బాధ్యతలోనైనా సమర్థవంతంగా రాణించే సత్తా కలిగిన నాయకుడని గుర్తింపు ఉండడంతో సీఎం కేసీఆర్ క్యాబినెట్‌లో రెండోసారి మంత్రి వర్గంలో చోటు కల్పించడం గమనార్హం.

మేడ్చల్ జిల్లా, నమస్తే తెలంగాణ ప్రతినిధి : చామకూర మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాస్ అండ్ క్లాస్ లీడర్‌గా, వ్యాపారవేత్తగా, విద్యాసంస్థల అధినేతగా సుపరిచితుడు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరి నుంచి ఎంపీగా, మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచి మరో జాక్‌పాట్ తగిలింది. నేడు కేసీఆర్ క్యాబినెట్‌లో ఉదయం 11.30 గంటలకు ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు ఆయనకు సీఎం కేసీఆర్ నుంచి ఆహ్వానం అందింది. బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీడీపీని వదిలి టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిననాటి నుంచి నేటి వరకు అనతికాలంలోనే టీఆర్‌ఎస్‌లో ముఖ్యనేతలలో ఒక్కరిగా నిలిచారు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ జిల్లా పరిధిలోని మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన ఎమ్మెల్యేల జాబితాలో మూడోస్థానంలో నిలిచారు. తాను కిందిస్థాయి నుంచి వచ్చి నేడు పార్లమెంట్ వరకు వెళ్లాలని తరుచుగా చెప్పే మల్లారెడ్డి తాజాగా మంత్రివర్గంలో చేరబోతున్నారు. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా ప్రజలు, టీఆర్‌ఎస్ కార్యకర్తలు, ఆయన అభిమానులు సంబురాలు జరుపుకొంటున్నారు.

69
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...