దివ్యాంగ ఓటర్లను గుర్తించండి..


Fri,November 16, 2018 12:33 AM

మేడ్చల్ కలెక్టరేట్: జిల్లాలో దివ్యాంగ ఓటర్లును గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ సూచించారు. గురువారం సచివాలయం నుంచి నిర్వహించన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగులకు కావాల్సిన వీల్‌చైర్‌లు, ర్యాంప్‌లు, రవాణా సౌకర్యం వంటి అంశాలను చర్చించారు.జిల్లాలో సమసాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి జిల్లా ఎస్పీలతో మాట్లాడి బందోబస్తును ముమ్మరం చేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంవీరెడ్డి సమాధానమిస్తూ జిల్లాలో 38,873 మంది దివ్యాంగులుండగా, వీరిలో 28,573 మంది 18 ఏండ్లు నిండిన వారు ఉన్నారని,16,668 మంది పింఛన్ల్లు తీసుకుంటున్నారని తెలిపారు. ఇప్పటి వరకు వీరిలో 14,379 మందిని ఓటర్లుగా నమోదు చేసుకొని పోలింగ్ కేంద్రాల వారీగా గుర్తించామన్నారు. జిల్లాలోని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగ ఓటర్ల కోసం 1218 వీల్‌చైర్‌లు అవసరం కాగా, అందులో కేవలం 115 చైర్స్ మాత్రమే అందుబాటు ఉన్నాయని, మిగిలిన వాటి కోసం ప్రతిపాదనలు పంపినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఎన్నికల నోడల్ అధికారులు కౌటిల్య, స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.

పలు సూచనలు
కలెక్టరేట్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎంవీరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటింగ్ సామగ్రిని భధ్రపరిచే స్ట్రాంగ్ రూంలను సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డీఆర్వో మధుకర్‌రెడ్డి, నోడల్ అధికారుల, ఆర్వోలు పాల్గొన్నారు.

120
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...