సెల్‌ఫోన్ డ్రైవింగ్.. మితిమీరిన వేగం


Thu,November 15, 2018 12:38 AM

సిటీబ్యూరో,నమస్తేతెలంగాణ : ఔటర్ రింగ్‌రోడ్డుపై సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల వాహనదారులకు వారు ఎంత వేగంతో దూసుకుపోతున్నారో తెలియడం లేదని తాజాగా, గతంలో చోటు చేసుకుంటున్న సంఘటనల ఆధ్యయనంలో బయటపడింది. మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కూడా కారు నడిపిస్తున్న దినేశ్‌కుమార్ సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్లే అతను ఎంత వేగంతో ప్రయాణిస్తున్న విషయాన్ని పసిగట్టలేకపోవడంతో పాటు అతను దిగాల్సిన ప్రాంతాన్ని దాటి ముందుకు వెళ్లడంతో గందరగోళంలో వాహనాన్ని ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి 160 కిలోమీటర్ల వేగంతో డివైడర్‌ను ఢీకొట్టి ఘోర ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనలో దినేష్‌కుమార్, భార్య సాగరిక, కుమారుడు రుద్రాంష్‌లు మృతిచెందిన విషయం తెలిసిందే.

విచారణలో ప్రమాదం జరిగిన 5 నిమిషాల్లో బావమరిది రుషికేష్‌తో ఫోన్ మాట్లాడినట్లు విశ్లేషణలో తెలియడంతో పోలీసులు సెల్‌ఫోన్ డ్రైవింగ్‌ను అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్‌పై ప్రయాణించే వారు 120 కిలోమీటర్‌ల వేగాన్ని మించకూడొద్దని సీపీ మహేశ్ భగవత్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఓఆర్‌ఆర్‌పై 100 కిలోమీటర్‌ల వరకే అనుమతి ఉండేది. తాజా ఉత్తర్వులతో వేగాన్ని 120కి పెంచామన్నారు. అయినా వాహనదారులు ఈ వేగాన్ని దాటి 150-160కు మించి దూసుకుపోతుండడం ప్రమాదాలకు కారణమవుతుందని సీపీ వివరించారు. 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ప్రతి వాహనాన్ని లేజర్ గన్‌లు చిత్రీకరించిన ఫొటోల ద్వారా చలాన్‌లను జారీ చేస్తున్నామన్నారు.

132
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...