30 గంటల్లో.. ఎనీ ఫారిన్ లాంగ్వేజ్


Thu,November 15, 2018 12:38 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : ఇది వరకు ఏదైనా భాష నేర్చు కోవాలంటే 30 రోజుల్లో తమిళం.. 30 రోజుల్లో మరాఠి.. 30 రోజుల్లో హిందీ నేర్చుకోండి అనే పుస్తకాలు అందు బాటులో ఉండేవి. పుస్తకాలు కొని అవపోసన పడితే అంతంత మాత్రమే వచ్చేది. అంతగా భాషలను నేర్చుకోవడానికి శ్రమించాల్సి వచ్చేది. ఆ కాలంలో ఈ పుస్తకాలు అంతగా ఉప యోగపడేవి. ఇప్పుడు కంప్యూటర్ కాలం. ఇంటర్నెట్ అందుబాటులో ఉండటంతో కేవలం 30 గంటల్లో ఏదేని విదేశీ భాషను నేర్చుకోవచ్చు. ఇలాంటి సదవకాశాన్ని మన నగరంలోని ఆంగ్ల, విదేశీభాషల విశ్వవిద్యాలయం (ఇఫ్లూ) కల్పిస్తున్నది. విదేశీ భాషను నేర్పించేందుకు ఏర్పాటైన ఈ విశ్వవిద్యాలయం, అంతర్జాతీయతంగా ప్రాచుర్యం పొందిన భాషలను ఎం చుకుని వెబ్‌సైట్ ద్వారా ఉచితంగా నేర్పించనున్నది. ఇటీవలీ కాలంలో విదేశీపర్యటనకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్నది. వ్యాపార అవసరాలు, సరదా, పర్యాటకం తదితర అవస రాల కోసం జనం విదేశాలను చుట్టేస్తున్నారు. ఇలాంటి వారు వెళ్లిన తర్వాత అక్కడ భాష పరమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు. హోటళ్లు, ట్యాక్సీలు, ఫుడ్ ఆర్డర్ ఇవ్వడంలో సమాచార మార్పిడి కష్టతరమవుతున్నది. ఇలాంటి వారి కోసమే ఇఫ్లూ ఈ తరహా ప్ర యో గం చేస్తున్నది. విదేశీభాష ప్రియులతో పాటు, విదేశాలకు వెళ్లే వారికోసం, అక్కడి వారితో వ్యవహరించేందుకు అవసరమైన భాషను నేర్పించబోతున్నది.

నేర్చుకునే వీలున్న భాషలివే..
ఆంగ్లం, సంస్కృతం, హిందీ, రష్యన్, జర్మన్, ఫ్రెంచ్, స్పానిష్, ఇటాలియన్, అరబిక్, జపనీస్, కొరియన్, చైనీస్, పర్షియన్

146
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...