వంట గ్యాస్ రూ. 1000


Wed,November 14, 2018 12:19 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: గత నాలుగన్నరేళ్లలో వంట గ్యాస్ ధర అమాంతం పెరిగింది. బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టాక మొట్టమొదటిసారి వంటగ్యాస్ ధర రూ. 1,000 దాటింది. కేంద్ర ప్రభుత్వం వల్ల ఇప్పటికే పెట్రోల్, డీజీల్‌తోపాటు ఆటో ఎల్పీజీ, సీఎన్జీ ధరలు ఆకాశన్నంటుతుండటంతో ఇదే బాటలో వంట గ్యాస్ ధర కూడా భారీగా పెరుగుతున్నది. 2014లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు వంట గ్యాస్(14.2 కిలోల) సిలిండర్ ధర రూ.414 ఉండగా రెండు, మూడ్రోజుల క్రి తం నుంచి సిలిండర్ ధర రూ.1,000.49 గా ఉంది. ఇందులో రూ. 952.85పైగా ఉండగా జీఎస్‌టీ కలుపుకుని రూ.1,000.49పైసలు అయ్యింది. దీనికితోడు డెలివరీ బాయ్ మరో రూ.20 నుంచి 25 వసూలు చేస్తుండటంతో వినియోగదారుని జేబుకు చిల్లుపడుతున్నది. ఇప్పటికే ఇంధన ధరల పెరుగుదలతో నిత్యావసర ధరలపై తీవ్ర ప్రభావం పడి సామాన్యుని జీవనం భారంగా గడుస్తుండగా మూ లిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా వంట గ్యాస్ ధర పెరుగడం సామాన్యులకు తీరని భారంగా మా రింది. దీనికంతటికి అంతర్జాతీయంగా ఇంధన వనరుల ధరలు పెరగడమే కారణమని చమురుసంస్థలు ప్రకటిస్తున్నా యి. అయితే గతం లో కూడా వెయ్యి రూపాయలు దాటిన రోజులున్నాయి. 2013 సందర్భంలో కూడా గ్యాస్ ధర రూ.1100 దాటినట్లు అధికారులు చెబుతున్నారు.

196
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...